Begin typing your search above and press return to search.
అమరావతిపై ఐవైఆర్ పుస్తకం..పవన్ మీదుగానే ఆవిష్కరణ
By: Tupaki Desk | 1 April 2018 2:08 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయడంపై గతంలో గళం విప్పిన మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అదే అంశంపై మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తన మనోభావాలతో, వివిధ రాజధానుల అనుభవంతో ఓ పుస్తకం ప్రచురించాలని ఆయన డిసైడయ్యారు. రాజధాని నిర్మాణం - అవసరాలు - భూ సమీకరణపై ఎవరి రాజధాని అమరావతి అనే పేరుతో పుస్తకం రచించినట్లు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. విజయవాడలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాలను పంచుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణానికి తగిన రీతిలో అడుగులు వేయడం లేదని గతంలోనే ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు వైఖరి నిర్లక్ష్యంగా ఉందని ఐవైఆర్ ఆరోపించారు. మొదటి నుంచి సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే రాజధాని నిర్మాణం ముందుకు సాగడం లేదని విమర్శించారు. పలు సదస్సుల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఆందోళనకు మరింత కొనసాగింపు అన్నట్లుగా ఆయన పుస్తకాన్ని రచించారు. ఎవరి రాజధాని అమరావతి పేరుతో తాను రాసిన పుస్తకాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 5వ తేదిన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్ లో ఆవిష్కరిస్తారని చెప్పారు.
భూ సమీకరణ, స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలు, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, ఇటీవల నిర్మించిన రాజధానులు లాంటి అంశాలతో పుస్తకాన్ని రచించినట్లు ఐవైఆర్ తెలిపారు. దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భాల్లో ఛండీగఢ్, భువనేశ్వర్, రాయ్‌పూర్, రాంచీ లాంటి రాజధానులను ఏ ప్రాతిపదికన కట్టారు, అసలు ప్రపంచ వ్యాప్తంగా రాజధానుల నిర్మాణాల అనుభవాలేంటి? తదితర అంశాలను కూలంకుశంగా పరిశీలించి ఒక పుస్తకం రాశానని ఐవైఆర్ చెప్పారు. రాజధాని పరిపాలనా నగరంగానే ఉండాలే తప్ప.. మెగాసిటీగా నిర్మించడం అనవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి అంతర్జాతీయ రాజధాని అనేది తప్పని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. మెగాసిటీ పంథాలో ముందుకెళ్తే రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు తప్పవన్నారు. ఈ నెల 5న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. టీడీపీ నేతలకు కూడ ఆహ్వానం పంపానని ఆయన చెప్పారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు ఎవరి రాజధాని అమరావతి పుస్తకాన్ని అంకితం ఇవ్వనున్నట్టు ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. లోక్ సత్తా జేపీ వేసిన కమిటీతో గందరగోళం నెలకొనే అవకాశముందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రీజనబుల్‌గానే ఏపీ రాష్ట్రానికి నిధులు వచ్చాయని, మరిన్ని నిధులు రావాల్సి ఉందన్నారు. కాగా, రాజధాని నిర్మాణానికి అమరావతి ఎంపిక, అమరావతి నిర్మాణం సాగుతున్న తీరుపై పవన్ కళ్యాణ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో...ఆయన చేతుల మీదుగానే పుస్తకం ఆవిష్కరించాలని ఐవైఆర్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.