Begin typing your search above and press return to search.
'చంద్ర' శత్రువులకు పవనే దిక్కా?
By: Tupaki Desk | 2 April 2018 10:46 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వ్యతిరేకించే వారందరికీ పవన్ కళ్యాణ్ ఆపద్భాంధవుడిలా గా కనిపిస్తున్నట్లుగా వుంది . నిజానికి చంద్రబాబు వ్యతిరేకత విషయంలో అంతకంటే పెద్ద ప్రత్యర్థి జగన్మోహనరెడ్డి ఉన్నప్పటికీ.. ఇన్నాళ్ళుగా రకరకాల కారణాల వలన ఆయనకు దూరంగా ఉండిపోయిన వారు, ఇప్పుడు హఠాత్తుగా ఆయన దరికి చేరలేక పోతున్నవారు .. పవన్ కళ్యాణ్ కు ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నట్లు గా కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలో అసలు రాజధాని నిర్మాణమే సరికాదంటూ తనదైన శైలిలో విశ్లేషిస్తూ ... ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రెటరీ ఐ.వై.ఆర్ క్రిష్ణారావు రాసిన పుస్తకం ఇప్పుడు ఆవిష్కరణకు నోచుకోబోతున్నది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించబోతున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులందరూ కూడా చంద్రబాబు వ్యతిరేకతలో తలలు పండిపోయిన వారే కావడం విశేషం. ఈ పుస్తకాన్ని అంకితం రూపేణా వడ్డే శోభనాద్రీశ్వర రావు కు ఇస్తుండడం కూడా గమనించాల్సిన అంశం.
కృష్ణా రావు రాసిన ఈ పుస్తకం బయటకు వస్తే కనుక రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయడంలో చంద్రబాబు ఎలాంటి కుట్రలకు పాల్పడ్డారో - ఎన్ని దురాలోచనలు చేశారో... అన్ని సంగతులు బయటకు వస్తాయని అందరికీ అర్థమవుతాయని పలువురు భావిస్తున్నారు.
రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ ఇప్పటికే తప్పుపట్టారు. అమరావతి అనేది ఒక కుల రాజధానిగా మారిపోయిందని పవన్ బాహాటంగానే విమర్శించారు కూడా. ఆయన వాదనకు దన్నుగా.. అసలు రాజధాని స్థల ఎంపికే పెద్ద కుట్రతో కూడుకున్నదని ఐవైఆర్ పుస్తకం చెప్పబోతున్నది!
‘ఎవరి రాజధాని అమరావతి?’ అనే శీర్షికతో వస్తున్న ఈ పుస్తకం ఆవిష్కరణ సందర్భమే చాలా కీలకంగా కనిపిస్తోంది. ఒకవైపు రాజధాని నిర్మాణానికి అప్పులివ్వండి అంటూ.. రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు అభ్యర్థిస్తున్న సమయంలో.. ఆ ప్రదేశంలో రాజధాని నిర్మాణమే తగదంటూ.. కృష్ణారావు రాసిన పుస్తకం ప్రజల్లో కొత్త ఆలోచనలు పుట్టించే అవకాశం ఉన్నదని, చంద్రబాబు బండారాన్ని బట్టబయలు చేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.