Begin typing your search above and press return to search.
జగన్ ను నిలువరించడానికి పవన్ మాస్టర్ ప్లాన్?
By: Tupaki Desk | 1 Jan 2020 6:04 AM GMTఏపీ లో ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేల బలమున్న సీఎం వైఎస్ జగన్ ఎంతో బలవంతుడు.. ఆయనతో పోలిస్తే ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు జారిపోతున్న చంద్రబాబు పరిస్తితి మరీ తీసికట్టుగా మారింది. ఇక జనసేనాని పవనాలు.. రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. మరి జగన్ సాహసోపేతమైన నిర్ణయాల తో రాజధాని మార్పుతో ముందుకెళ్తుంటే ఆయనను ఎలా ఆపడం.? అని బాగా ఆలోచించిన ప్రతిపక్ష బ్యాచ్ ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ తో నరుక్కురావడానికి రెడీ అయ్యిందట..
అవును.. బీజేపీ ని కాలదన్ని ఎదురించి పోటీచేసిన చంద్రబాబు ఏపీ లో బొక్క బోర్లా పడ్డాడు. రోజురోజుకు ఎమ్మెల్యేలు జారిపోతుంటే బలహీనమైపోతున్నాడు. ఆయనను ఢిల్లీలో నమ్మేవాళ్లు..నమ్మి రాజకీయం చేసే వాళ్లు లేరు.. ఉన్న పరపతి మొత్తం పోయింది..
మరి బలమైన జగన్ ను ఢీ కొట్టడానికి కేంద్రానికి కనిపిస్తున్న ఒకే ఒక పేరు ‘పవన్ కళ్యాణ్’. ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఫైర్ బ్రాండ్ తో ఎప్పటికైనా బీజేపీ లో కలిపేసుకొని టీడీపీ ని కుదేలు చేసి ఏపీలో జగన్ కు సరిజోడిగా నిలబెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ఆ క్రమంలోనే ఇక్కడ పవన్ కూడా రాజధానిలో ఆందోళన చేసినా.. చంద్రబాబు తో కలిసి నానా యాగీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఢిల్లీ బాట పడుతున్నారట.. ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసి రాజధానిని మార్చకుండా జగన్ ను నిలువరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడట.. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా కేంద్రం లోని పెద్దలు జగన్ ముందరి కాళ్ల కు బంధం వేస్తే ఒక్క సారిగా ఏపీ లో హీరో అయిపోదామని పవన్ కలలుగంటున్నాడట..
మరి కేంద్రం పవన్ కు సహకరిస్తుందా? జగన్ ను నిలువరిస్తుందా? పవన్ కలలు నెరవేరుతాయా అన్నది వేచిచూడాలి.