Begin typing your search above and press return to search.
కాపు ఉద్యమానికి ‘పవర్’ వస్తుందా?
By: Tupaki Desk | 15 Jun 2016 7:36 AM GMTకాపు ఉద్యమం - ఆ ఉద్యమ నేత ముద్రగడ దీక్ష నేపథ్యంలో అందరి దృష్టి అదే సామాజిక వర్గానికి చెందిన సినీ హీరో - జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఉంది. అయితే.. వారం రోజులుగా ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తూ ఆయన ఆరోగ్య క్షీణిస్తున్నా ఈ విషయంలో మాత్రం పవన్ ఇంతవరకు స్పందించలేదు. పవన్ సోదరుడు చిరంజీవి దీనిపై చంద్రబాబుకు లేఖ రాయడం.. తన వైఖరి తెలియజేయడం.. ముద్రగడకు సంఘీభావం ప్రకటించడం వంటివి చేసినా పవన్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఇప్పటికే చాలామంది నేతలు మీడియా ముఖంగా పవన్ ని స్పందించాలని కోరినా ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. కాపులకు సపోర్టు ఇవ్వడం వల్ల మిగతావర్గాలకు దూరమవుతానన్న భయం ఆయనలో ఉండడం వల్లే దీనిపై స్పందించలేదని తెలుస్తోంది. అయితే.. అలా చేయడం వల్ల బలమైన కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుండడంతో సున్నితమైన ఈ అంశంలో పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభంను కలవడానికి ముహూర్తం నిర్ణయించినట్లు పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ బుధవారమే ముద్రగడను కలుస్తారని తెలుస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవన్ ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రి బయలుదేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను పరామర్శించినున్నారని తెలుస్తోంది. పవన్ తో కాపు నేతలు భేటీ అయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అయితే.. పవన్ ముద్రగడను గనుక కలిస్తే.. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో ఆయన కోసం రాజమండ్రికి పెద్ద సంఖ్యలో కాపులు వస్తుండడంతో పోలీసులు ఇప్పటికే అక్కడ భద్రత పెంచారు. ఈ సమయంలో పవన్ వచ్చి ముద్రగడను కలిస్తే మరింత మంది జనం తరలివచ్చే అవకాశం ఉంది. సో.. పవన్ ను ముద్రగడను కలిసేందుకు అనుమతి ఇస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ.. ఏపీ ప్రభుత్వంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో పవన్ కు అడ్డు చెప్పకపోవచ్చని తెలుస్తోంది.