Begin typing your search above and press return to search.

పవన్ ఇప్పుడు త‌ప్ప‌క స్పందిస్తాడు

By:  Tupaki Desk   |   6 Dec 2015 10:30 AM GMT
పవన్ ఇప్పుడు త‌ప్ప‌క స్పందిస్తాడు
X
జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మౌనంగా ఉంటున్నాడు, చెన్నై వ‌ర‌ద‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న స్పందించ‌డం లేదు అనే వారు ప‌వ‌న్ స్పందించి స‌మ‌యం గ్ర‌హించాల‌ట‌. ప్ర‌శ్నించేందుకే తానున్నాన‌ని చెప్పిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌ధాని గ్రామాల్లో భూసేక‌ర‌ణ విష‌యంలో త‌న‌దైన శైలిలో స్పందించారు. భూములు స‌మీక‌రించాలే త‌ప్ప రైతుల‌కు వ్య‌తిరేకంగా సేక‌రిస్తే...స‌హించేది లేద‌ని అల్టిమేటం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ప‌వ‌న్ తెర‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

రాజధాని అమ‌రావ‌తి గ్రామాల్లో భూ సమీకరణ కింద రాని భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి దశలో తుళ్లూరు మండల గ్రామాల భూములకు, రెండో దశగా తాడేపల్లి - మంగళగిరి మండలాల భూములకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉన్న‌తాధికారులు నిర్ణయించిన‌ట్లు స‌మాచారం. ఈ నోటిఫికేషన్‌ ల‌లో ఆయా గ్రామ కంఠాల భూములనూ చేర్చనున్నారని తెలిసింది. ఈ వివరాలనూ సీఆర్‌ డీఏ అధికారులు అధ్యయనం చేశారు. నోటిఫికేషన్‌ ఇచ్చాక వారం రోజుల పాటు సంబంధిత భూ యజమానులు వారి వివరణలు చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ ఆ భూములను పూలింగు కింద రైతులు ఇస్తామన్నా తీసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

గ్రామ కంఠాల వివరాలనూ ఆయా గ్రామాల జన్మభూమి కమిటీలతో చర్చించి సిద్ధం చేశారు. ప్రసుత్తం రాజధాని ప్రాంతంలో దాదాపు అన్ని గ్రామాల్లో గ్రామ కంఠాలు విస్తరించాయి. ఎర్రబాలెం లాంటి చోట్ల సుమారు 300 ఎకరాల్లో పూర్తిగా ఇళ్లే ఉన్నాయి. అయినా నోటిఫికేషన్‌ ఇచ్చేశారు. పెనుమాక, బేతపూడి వంటి గ్రామాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. గ్రామాలకు ఆనుకున్న పొలాల్లో రైతులు ఇళ్లు నిర్మించుకు న్నారు. ప్రస్తుతం వాటిపైనే ప్ర‌భుత్వం దృష్టిసారించిన నేప‌థ్యంలో...త్వ‌ర‌లో నోటిఫికేష‌న్ ఇస్తే గ‌నుక ప‌వ‌న్ తెర‌మీద‌కు రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.