Begin typing your search above and press return to search.
తెలంగాణలో లేటుగా మేల్కొన్న జనసేన!
By: Tupaki Desk | 9 Oct 2018 12:37 PM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అక్కడి పార్టీలు ప్రచార కార్యక్రమాలు - అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన సంగతి తెలిసిందే. ఏ అభ్యర్థికి ఏ సీటు కేటాయించాలి.....గెలుపు గుర్రాలెవరు అన్న సమీకరణాల్లో బిజీగా ఉన్నాయి. కానీ, ఇప్పటిదాకా తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో, ముందస్తు ఎన్నికల్లో పాల్గొనే అంశంపై జనసేన దృష్టి పెట్టిందట. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా...ఒకవేళ పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి.. వంటి అంశాలపై మేధోమధనం ప్రారంభించిందట. 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసేన నేతలు ....పవన్ కు సూచిస్తున్నారట. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ...సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చకచకా జరిగిపోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే తెలంగాణలోని జనసేన ముఖ్య నేతలతో ఈ నెల 16న పవన్ భేటీ కాబోతున్నారట. ఆ భేటీ అనంతరం తెలంగాణ ఎన్నికల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా...తమ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడానికి కనీసం ఒకటి రెండు నెలల ముందే పోటీ చేసే అంశంపై ఓ క్లారిటీతో ఉంటుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై దాదాపుగా రెండు నెలల నుంచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో, అన్ని పార్టీలు పొత్తులు...ఎత్తులు...పై ఎత్తులపై కసరత్తు ప్రారంభించి...నోటిఫికేషన్ విడుదల నాటికి ఓ ప్రణాళికను రూపొందించుకున్నాయి. కానీ, జనసేన పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిగతా పార్టీలన్నీ దాదాపుగా ప్రచారంలో మునిగిపోయి ఉంటే...జనసేన మాత్రం అసలు పోటీ చేయాలా వద్దా అన్న విషయం దగ్గరే స్ట్రక్ అయిపోయింది. ఇక ఇపుడు పోటీపై నిర్ణయం తీసుకునేదెపుడు.... తీసుకున్నా...అభ్యర్థుల ఎంపిక జరిగేదెపుడు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలే కొత్త పార్టీ...దానికి తోడు లేటు నిర్ణయాలు...వెరసి జనసేన రాజకీయాల్లో సీరియస్ నెస్ లోపించిందని విమర్శలు వస్తున్నాయి. పవన్ కు రాజకీయ పరిపక్వత లేదన్న విషయాన్ని తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం మరోసారి నిరూపించిందని సెటైర్లు పేలుతున్నాయి. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు....పవన్ లేటుగా మేల్కొన్నారని విమర్శలు వస్తున్నాయి. లేటైనా...లేటెస్టుగా పవన్ వస్తాడేమోనని సెటైర్లు పేలుతున్నాయి. దాదాపుగా ఏపీలో కూడా పవన్ పరిస్థితి ఇలాగే ఉన్న నేపథ్యంలో....అక్కడైన త్వరపడి నిర్ణయాలు తీసుకుంటారో లేదో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.