Begin typing your search above and press return to search.

ఈ వివక్ష ఏంటి మోడీజీ: పవన్

By:  Tupaki Desk   |   17 March 2017 12:48 PM GMT
ఈ వివక్ష ఏంటి మోడీజీ: పవన్
X
జనసేన అధినేత, ప‌వ‌ర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్ మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వం - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీరుపై మండిప‌డ్డారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో రుణ‌మాఫీ హామీని స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యమై ఇవాళ కేంద్ర మంత్రి రాధామోహ‌న్ సింగ్ స్పందిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ద్వారా ఆ అప్పు మొత్తాన్ని చెల్లిస్తామ‌ని తెలిపారు. ఈ ప‌రిణామంపై ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్‌ స్పందించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కోరారు. రైతు రుణమాఫీ చేయాలంటూ తెలుగు రాష్ట్రాలు అడిగినా కేంద్రం పట్టించుకోవడం లేదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

యూపీలో మాత్రమే రుణమాఫీ ఇవ్వడానికి అంగీకరించడం సరైంది కాదని ప‌వ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రుణమాఫీ విషయంలో దక్షిణాది రాష్ట్రాలను విస్మరించడం సరికాదని పవన్‌ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాలను పట్టించుకోలేదన్నారు. ఒక్క ప్రాంతానికే పరిమితమైతే ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయని ప‌వ‌న్ త‌న ట్వీట్ల‌లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కాగా, జ‌న‌సేన పార్టీ ఏర్ప‌డి మూడేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో తాను ఎన్డీఏ భాగ‌స్వామిని కాన‌ని ప‌వ‌న్ తేల్చిచెప్పిన విష‌యం తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసిన ప‌వ‌న్ ఈ కామెంట్‌ చేయ‌డంతో బీజేపీ-జ‌న‌సేన చీలిక‌పై క్లారిటీ వ‌చ్చింది. దాన్ని నిజం చేస్తున్న‌ట్లుగా ప‌వ‌న్ తాజాగా ప్ర‌ధాని మోడీ తీరుపై మండిప‌డ్డారు. అదే స‌మ‌యంలో ఉత్త‌రాది-ద‌క్షిణాది పేరుతో మోడీ చ‌ర్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు.

ఇదిలాఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేకంగా యూపీ దృష్టి పెట్టి మ‌రీ యూపీ రుణ‌మాఫీ చేయ‌డంపై తుపాకి ప్ర‌త్యేక క‌థ‌నం వెలువ‌రించింది. ప‌వ‌న్ గ‌తంలో ఆవేద‌న చెందిన‌ట్లే ఉత్త‌రాది-ద‌క్షిణాది వివ‌క్ష చూపిస్తున్నారంటూ ఆధారాల‌తో స‌హా స‌వివ‌ర క‌థ‌నం రాసింది. తెలుగు రాష్ర్టాల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తి చాటింది. అనంత‌రం ప‌వ‌న్ ఈ మేర‌కు ఏపీ- తెలంగాణ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి స్పంద‌న తీరుపై ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌క‌రం. ఇదిగో తుపాకి రాసిన క‌థ‌నం వార్త లింక్‌.

క్లిక్ చేయండి


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/