Begin typing your search above and press return to search.
పవన్ ట్వీట్లు.. మూడు డౌట్లు
By: Tupaki Desk | 13 July 2015 4:38 AM GMT నిన్నటి వరకు టీడీపీ నేతలను టార్గెట్ చేసి ట్విట్టర్ లో మాటాల తూటాలు పేల్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారు. వారిపై సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ గాలికొదిలేసిందని ట్విట్టర్ లో ఆయన ఘాటైన కామెంట్లు చేశారు. అంతేకాదు... 5 కోట్ల సీమాంధ్రుల ప్రయోజనాలు మీకు పట్టవా అంటూ డైరెక్టుగా అడిగేశారు.
అయితే.... ఆయన ట్వీట్లను పరిశీలించిన వారందరికీ మూడు అనుమానాలు తలెత్తుతున్నాయి. పవన్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ తరఫున గళం విప్పుతున్నారా అని చాలామంది సందేహిస్తుండగా... ఇంకొందరు మాత్రం ఇంకో అడుగు ముందుకేసి... విభజన సమయానికి కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా ఉన్న తన అన్న.. ఏపీలో కాంగ్రెస్ ముఖ్య నేత అయిన చిరంజీవిని ఈ విషయంలో ప్రశ్నించకుండా ఆ పార్టీని ప్రశ్నిస్తే లాభమేంటని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలతో ముడిపడిన ప్రత్యేక హోదా అంశంపై పోరాడడం మానేసి లలిత్ మోడీ వ్యవహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పవన్ విమర్శించడం బాగానే ఉన్నా ఆ కాంగ్రెస్ తానులోనే తన అన్న కూడా ఉన్నారన్న సంగతి మాత్రం మర్చిపోవడం విడ్డూరం.
మరోవైపు.. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ అందరిలోనూ చురుకు పుట్టించడం మంచిదే కానీ అదే సమయంలో అవినీతి వ్యవహారానికి సంబంధించిన లలిత్ మోడీ కేసుకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నట్లుగా మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇంతకుముందు ఓటుకు నోటు ఇష్యూపైనా పెద్దగా స్పందించలేదు... దీన్ని బట్టి ఆయన అవినీతిని పెద్దగా పట్టించుకోవడం లేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.