Begin typing your search above and press return to search.
పవన్ మార్క్ డౌట్ : అప్పటివరకూ తిట్టిన నాయకులు ఇపుడు ఎందుకు పొగుడుతున్నారు...?
By: Tupaki Desk | 8 Jun 2022 12:30 PM GMTపవన్ రాజకీయ నాయకుడు కాదు అని చాలా మంది అంటారు. అది నిజమే. ఆయనకు ఆయన చెప్పుకున్నట్లుగా దశాబ్దన్నర నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా అందులోవి చాలా విషయాలు ఆయనకు వంటబట్టలేదు. పైగా ఆయన కామన్ మాన్ గానే ఆలోచన చేస్తారు అని చాలా సార్లు ఆయన ప్రసంగాలు ఆవేశాలు కావేశాలు చూస్తే అర్ధమవుతుంది. ఇక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరు అంటారు. కానీ పవన్ కి మాత్రం వైసీపీ శాశ్వత శత్రువే. ఆ పార్టీ వారి నోటి వెంట ఏ ఒక్క మాట వచ్చినా ఆయన దానికి టీకా తాత్పర్యాలతో సహా తీసి మరీ చెప్పగలుగుతారు.
ఒక విధంగా ఆలోచిస్తే పవన్ మొత్తం ఫోకస్ వైసీపీ వారి మీదనే ఉంటుందనే అంటార్. వైసీపీ నీడను కూడా తాకనివ్వరేమో అని కూడా సందేహపడేవారు ఉన్నారు. ఇక లేటెస్ట్ గా పవన్ చేసిన ఒక ట్వీట్ వెనక అర్ధాలు పరమార్ధాలు ఏమిటి అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది. ఇంతకీ పవన్ చేసిన ట్వీట్ ఏంటి అంటే అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే అంటూ ట్వీట్ చేశారు. జర భద్రం అని కూడా జనసైనికులకు సూచించారు.
దానికి కొనసాగింపుగా అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి అని హెచ్చరించారు. దీంతో పవన్ చేసిన ట్వీట్లకు జనసైనికులు రిప్లై ఇస్తూ హోరెత్తిస్తున్నారు.
పవన్ అన్న కరెక్ట్ గా చెప్పారు అని మద్దతు ప్రకటిస్తున్నారు. ఇంతకీ పవన్ ఎవరి మీద ఈ ట్వీట్ చేశారు అంటే కాకినాడ అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి మీద అని అంటున్నారు. ఈ మధ్యనే జనసేన టీడీపీల మధ్య పొత్తు మీద వాదులాట సాగుతోంది. అది కూడా సామాజిక మాధ్యమాలలో భీకరంగా ఉంది.
దాంతో జనసైనికులకు మద్దతుగా అన్నట్లుగా ద్వారంపూడి చేశారని చెబుతున్న ఒక ప్రకటన వైరల్ అవుతోందిట. అదేంటి అంటే ఎన్ని పొత్తులు ఉన్నా ఎందరు కలిసినా పవన్ సీఎం అని ప్రకటించకపోతే మాత్రం ఆ కూటమికి అసలైన కాపులు ఒక్క ఓటు కూడా వేయరు అని. ఒక విధంగా పవన్ సీఎం కావాలన్న ఆకాంక్ష అయితే ఈ ప్రకటనలో ఉంది.
మరి ద్వారంపూడి అంటే ఎవరు. జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఆయనకూ జనసైనికులకు కాకినాడలో ఆయన ఇంటి వద్ద జరిగిన గొడవ అప్పట్లో అతి పెద్ద సంచలనం నమోదు చేసింది. దాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేదని, భీమ్లా నాయక్ టైప్ లో ఏదో రోజున ట్రీట్మెంట్ ఇస్తాను అని ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతానని, ఆ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు బాధ్యతలు మొత్తం తానే తీసుకుంటాను అని ద్వారంపూడి కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు.
అలాంటి ద్వారంపూడి ఇలాంటి ప్రకటనలు చేస్తారు అని అనుకోరు కదా. కానీ ఆయన చేశారు అని వైరల్ అవుతోంది. దాని మీద జనసైనికులు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. దాంతోనే పవన్ కి ఒళ్ళు మండి మైండ్ గేమ్ ఇది ట్రాప్ లో పడవద్దు, జర భద్రం అంటూ ట్వీట్లు చేశారు అంటున్నారు. మొత్తానికి పవన్ ఫుల్ అలెర్ట్ గా ఉంటున్నారు అన్న మాట.
అయితే పవన్ చేసిన ట్వీట్ల మీద మరో వైపు నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. నిన్నటి దాకా పొగిడి ఇపుడు తిడుతున్న వారి మీద కూడా అర్ధాలు చెప్పండి పవన్ సార్ అని టీడీపీ జనసేన వివాదాల మీద కూడా కొందరు ట్విట్టర్ వేదికగా పవన్ని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఎన్ని అన్నా మాట్లాడని పవన్ వైసీపీ నుంచి ఒక్క పొగడ్తను కూడా మైండ్ గేమ్ అయినా భరించలేకపోతున్నారు అంటేనే ఆలోచించాలి అంటున్నారు. మొత్తానికి పవన్ కి రాజకీయాల్లో అసలైన శత్రువు ఎవరో తెలిసింది కదా. జనసైనికులు మాత్రం ఇంకా పొగడ్తల మత్తులో కాస్తా తడబాటు పడుతున్నారు. అదే తేడా మరి.