Begin typing your search above and press return to search.
ఆలోచించటానికి ఇంకెన్ని రోజులు కావాలి పవన్?
By: Tupaki Desk | 18 Oct 2015 12:58 PM GMTఏపీ రాజధాని అమరావతికి జనసేన అధినేత..పవర్ స్టార్ పవర్‌కల్యాణ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులు ప్రత్యేకంగా వచ్చిన పవన్ ను కలిసిన సమయంలో.. తాను వచ్చేందుకు ప్రయత్నిస్తానని.. షూటింగ్ ఉందని.. వీలు చూసుకొని వస్తానన్నట్లుగా వ్యాఖ్యానించారు.
అన్నయ్య చిరంజీవిని అభినందించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ మీడియాతో కాసేపు మాట్లాడారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను ఇంకా ఏమీ అనుకోలేదని.. ఇంకా ఆలోచించలేదని చెప్పారు. ఏపీ మంత్రులు స్వయంగా వచ్చిన కలిసి ఆహ్వానించిన నేపథ్యంలో శంకుస్థాపనకు వెళ్లాలా? వద్దా? అన్నది ఆలోచించటానికి ఎక్కువ సమయంలో అవసరమా అన్నది ప్రశ్న.
నిజానికి పవన్ కానీ శంకుస్థాపనకు వెళ్లాలని అనుకుంటే.. అదెంత సేపు? ప‌్రత్యేక హెలిక్టాఫర్లో వెళ్లి రావటానికి మహా అయితే ఒక రోజు కంటే ఎక్కువ సమయం పట్టదు. కానీ.. ఇంత చిన్న విషయానికి ఇంకా ఆలోచించలేదని.. షూటింగ్ తేదీలు చూసుకొని చెబుతానని చెప్పారు. షూటింగ్ తేదీలు చూసుకోవటానికి.. అడ్జెస్ట్ చేసుకునే విషయం మీద ఆలోచించటానికి మంత్రులు ఆహ్వాన పత్రం ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకూ తీరిక దొరకలేదా? అన్నది ఒక ప్రశ్న.
ఇక.. అన్నయ్య ఇంటికి వెళ్లిన విషయం గురించి మాట్లాడుతూ.. బ్రూస్లీ విజయాన్ని అభినందించటానికి వచ్చినట్లు చెప్పిన పవన్.. వ్యక్తిగతంగా.. సినిమాల పరంగా తమ కుటుంబం అంతా ఒక్కటేనని.. రాజకీయంగా భిన్నాభిప్రాయాల ప్రభావం వ్యక్తిగత సంబంధాల మీద పడదని చెప్పుకొచ్చారు. శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ వస్తారా? రారా? అన్నది ఆలోచించటానికి పవన్ కు ఇంకా ఎంత టైం కావాలో..?