Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ పర్యటన...కేసీయార్ జగన్ బంధం తెంచుతుందా...?

By:  Tupaki Desk   |   20 May 2022 8:30 AM GMT
పవన్ కళ్యాణ్ పర్యటన...కేసీయార్ జగన్ బంధం తెంచుతుందా...?
X
పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ ఏపీలో సుడిగాలి పర్యటన చేసి అక్కడ తన రాజకీయం ఏంటో చూసుకోకుండా తెలంగాణాలో ఎందుకు వేలు పెడుతున్నారు అని టీయారెస్ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తెలంగాణాలో కూడా పవన్ పర్యటన సక్సెస్ అయితే తెలంగాణాలో ఉన్న మున్నూరు కాపు కులస్థులు పవన్ కళ్యాణ్ కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తే అది టీయారెస్ రాజకీయానికే పెద్ద దెబ్బ అవుతుంది అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న మున్నూరు కాపు ఓట్లు భారీగానే టీయారెస్ కి పడుతున్నాయి. వారంతా గులాబీ పార్టీకే అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఈ ఓట్లు కనుక పవన్ కళ్యాణ్ కి టర్న్ అయితే మాత్రం అది టీయారెస్ రాజకీయానికి అతి పెద్ద కష్టం, నష్టాన్ని తెచ్చి పెడుతుందని టీయారెస్ వర్గాలలో చర్చ అయితే గట్టిగానే సాగుతోంది.

ఇక నల్గొండ జిల్లాలో జనసేన కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబాలకు అండగా ఉంటూ వారికి ఆర్ధిక భరోసా కింద చెక్కులు ఇవ్వడానికి పవన్ టూర్ పెట్టుకున్నారు. ఇలా ఆయన నల్గొండ టూర్ సాగుతోంది. ఈ నేపధ్యంలో నల్గొండలో జనసేన రాజకీయ హడావుడి మామూలుగా లేదు. అక్కడ పవన్ కి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున క్యాడర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో పవన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు కనుక వస్తే మాత్రం పవన్ టూర్ సూపర్ సక్సెస్ అయినట్లే. అదే జరిగితే టీయారెస్ కి భారీ దెబ్బ పడిపోతుంది అంటున్నారు.

ఇక పవన్ టూర్ మీద రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది కేసీయార్ జగన్ ల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెంచేందుకు చేస్తున్న టూర్ అని కూడా అంటున్నారు. ఇది పక్కా ప్లాన్ తో చేస్తున్న టూర్ అని కూడా అంటున్నారు. ఇక 2019 ఏపీ ఎన్నికల్లో కేసీయార్ జగన్ కి బాగా సహాయం చేశారని, అందువల్లనే అపుడు జగన్ కి ఆర్ధికంగా ఇబ్బంది లేకుండా పోయింది అని అంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికలు అంటే 2024 లో జగన్ కి మళ్ళీ కేసీయార్ నుంచి అలాంటి సహాయం అందకుండా చూసేందుకే తెలంగాణా రాజకీయాల్లో తన వేలు పవన్ పెడుతున్నారు అని అంటున్నారు. తెలంగాణాలో పవన్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ టీయారెస్ ఓట్లు వేయాలీ అంటే కనుక ఏపీ రాజకీయాల్లో పవన్ కి ఫుల్ సపోర్ట్ గా టీయారెస్ ఉండాలన్నది ఈ ప్లాన్ వెనక ఉన్న ఉద్దేశ్యమని అంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో టీయారెస్ కి ఇండైరెక్ట్ గా పవన్ సపోర్ట్ దక్కాలీ అంటే టీయారెస్ జగన్ తో తన స్నేహ బంధాన్ని తెంచుకోవాల్సి ఉంటుందనే అంటున్నారు. అయితే తెలంగాణా ఎన్నికలు 2023లో వస్తాయి. ఇక ఏపీలో ఎన్నికలు 2024లో జరుగుతాయి. ఇక 2023 ఎన్నికల్లో మూడవసారి టీయారెస్ తెలంగాణాలో గెలవాలి. అలా టీయారెస్ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ణి ముందుగా వాడుకుంటామని టీయారెస్ నాయకులు కొందరు అంటున్నారు.

మొత్తానికి చూస్తే రాజకీయాల్లో మిత్రులు శత్రువులు ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఎవరు ఎటు వైపు అయినా మారవచ్చు. అటూ ఇటూ కావచ్చు. అందువల్ల పవన్ కళ్యాణ్ నల్గొండ టూర్ ఒక వ్యూహాత్మకం అని అనుకున్నా కూడా రేపటి రోజున ఏమైనా జరగవచ్చు. కేసీయార్ జగన్ మిత్ర బంధం బీటలు వారనూ వచ్చు. ఏపీలో పవన్ కి టీయారెస్ సపోర్ట్ చేసినా చేయవచ్చు. ఇది ఫక్తు రాజకీయం కాబట్టి ఎన్ని అయినా జరగవచ్చు. ఈ విషయంలో ఏదీ ఊహగా మిగిలిపోదని కూడా అంటున్నారు.