Begin typing your search above and press return to search.
క్వారంటైన్ నుంచి ఆసుపత్రికి పవన్.. కరోనా రిపోర్టు ఇదే!
By: Tupaki Desk | 16 April 2021 5:35 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందిలో పలువురు కొవిడ్ బారిన పడడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పవన్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. క్వారంటైన్ నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని కూడా తెలిపింది.
అయితే.. క్వారంటైన్ నుంచి పవన్ ఆసుపత్రికి వెళ్లడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం.. లంగ్స్ ఇన్ఫెక్షన్ తో పవన్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఊపిరి పీల్చుకోవడంలో కాస్త ఇబ్బంది తలెత్తడంతో.. పవన్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని సమాచారం. ఈ పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలిందని వార్తలు వస్తున్నాయి. అయితే.. కరోనా టెస్టులో మాత్రం నెగెటివ్ రిపోర్టు వచ్చిందని అంటున్నారు.
కాగా.. వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజుతోపాటు బండ్ల గణేష్ కూడా కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో.. పవన్ కు సైతం కరోనా వ్యాపించిందా? అని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరి, వాస్తవ పరిస్థితి ఏంటన్నది పవన్ లేదా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.