Begin typing your search above and press return to search.
కొనసాగుతోన్న గల్లా-జనసేన ట్వీట్ వార్ !
By: Tupaki Desk | 28 April 2018 6:45 AM GMTతనను టార్గెట్ చేసిన మీడియా చానెళ్లపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వార్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, రెండు మూడు రోజులుగా జనసేనాని ...తనకు నచ్చిన పుస్తకాలలోని కొటేషన్స్ పెడుతూ....తన వార్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ ను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేయడం సంచలనం రేపింది. జగన్-పవన్ ల సినిమా త్వరలో విడుదల కాబోతుందని, ఈ చిత్రానికి రచన - దర్శకత్వం ప్రశాంత్ కిషోర్ అని... మోడీ-అమిత్ షా నిర్మాణంలో ఈ చిత్రం రాబోతోందని జయదేవ్ షాకింగ్ ట్వీట్ చేశారు. అయితే, గల్లా ట్వీట్ కు పవన్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో కాకుండా....జనసేన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో నుంచి కౌంటర్ ట్వీట్ చేశారు. గల్లా ట్వీట్ పై జనసేన నుంచి ఘాటుగా జవాబు వచ్చింది. ``వన్డే మ్యాచ్ లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్ పై మాట్లాడి సైలెంట్ అయిన గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా, కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..’’ అంటూ జనసేన గట్టిగా రిటార్ట్ ఇచ్చింది. జనసేన ట్వీట్ కు గల్లా కూడా తనదైన శైలిలో మళ్లీ జవాబిచ్చారు. అయితే, ఆ వెంటనే గల్లా ట్వీట్ కు జనసేన తరఫు నుంచి ఘాటైన బదులు ట్వీట్ రూపంలో వచ్చింది. దీంతో, గల్లా-జనసేనల ట్వీట్ వార్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
జనసేన ట్వీట్ కు గల్లా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ``గత నాలుగేళ్లలో పార్లమెంటులో 100 సార్లు ప్రసంగించడాన్ని సెంచరీ అంటారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం పై, ప్రధానిపై యుద్ధం చేస్తున్నాం. ప్రధానిని పవన్ ఎందుకు వెనకేసుకువస్తున్నారు? పవన్ ఎవరితో పోరాడుతున్నారు? ఇకపోతే, నా బ్యాటరీలు ఎప్పుడూ ఫుల్ చార్జింగ్ తో ఉంటాయి. దె లాస్ట్ లాంగ్....రియల్లీ లాంగ్....``అని గల్లా చేసిన ట్వీట్ వైరల్ అయింది. `అమరరాజా` బ్యాటరీ సంస్థల అధినేత అయిన జయదేవ్ ....తన బ్యాటరీ సంస్థ ట్యాగ్ లైన్ ను ఇక్కడ వాడారు. అయితే, గల్లా ట్వీట్ కు జనసేన నుంచి ఘాటైన రిప్లై వచ్చింది. `` గుంటూరు ప్రాంత వాసులు మీ కోసం వెతుకుతున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మీకోసం అన్ని చోట్లా వెతుకుతున్నారు. బహుశా పార్లమెంటులో మీరు చేసిన 100 ప్రసంగాలకు గానూ మిమ్మల్ని సన్మానిద్దామనుకుంటున్నారేమో. మీరు చివరిసారిగా గుంటూరులో ఎపుడు పర్యటించారు? మీ బ్యాటరీలు చార్జింగ్ పెట్టుకోంది!`` అంటూ జనసేన అదిరిపోయే రిటార్ట్ ఇచ్చింది. ఏది ఏమైనా పవన్, జనసేన- గల్లా ల మధ్య ట్వీట్ వార్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి, ఈ ట్వీట్ల యుద్ధం ఏ రకంగా మలుపు తీసుకుంటుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.