Begin typing your search above and press return to search.
ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఎదరు చూపులు..!
By: Tupaki Desk | 12 Jan 2020 1:16 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో అవమానం ఎదురైందా ? తాను లేస్తే మనిషిని కాదనే పవన్ .. రాష్ట్రంలో ఏంజరిగినా.. కేంద్రానికి ఫిర్యాదు చేసి అంతు చూస్తానని బెదిరించే పవన్‌ను ఇప్పుడు అదే కేం ద్రంలోని బీజేపీ పెద్దలు ఆయనను లైట్ తీసుకున్నారా? ఆ.. వస్తే ఏంటి? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారా? అంటే.. తాజాగా జరిగిన పరిణామాలు ఔననే అంటున్నాయి. రాష్ట్రంలో రాజధాని విషయంపై కొన్ని రోజులుగా టీడీపీ పెద్దలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పవన్ టీడీపీ వాయిస్ నే వినిపించారు.
ఇంతలోనే పవన్.. ఇంకేముంది .. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటే నే తప్ప జగన్ ను దారికి తీసుకురాలేమని అన్నారు. కేంద్రం ఈ విషయంలో ఉపేక్షించరాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ మాటలు అన్న వెంటనే ఆయన ఢిల్లీ విమానం ఎక్కేశారు. ఇంకేముంది.. ఢిల్లీ పెద్దలతో జగన్‌పై ఫిర్యాదు చేసి.. జగన్ ను దారికి తెచ్చేందుకు పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారంటూ.. ఓ వర్గం మీడియాలో పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ వార్తలు వచ్చేశాయి. దీంతో రాష్ట్రంలోని పవన్ అభిమానులు ఢిల్లీలో ఏం జరుగుతోందా? అని ఆశగా ఎదురు చూశారు.
మరి ఇంత హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన పవన్‌కు కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆహ్వానం పలికారా? అంటే లేనేలేదు. పైగా ఆయన శనివారం మధ్యాహ్నం నుంచి బీజేపీ పెద్దల కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. బీజేపీ నేతలతో అపాయింట్ ఖరారు కాకపోవడంతో పవన్ ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం హడావుడిగా ఢిల్లీకి బయలుదేరిన పవన్... బీజేపీ నేతలను కలుస్తారంటూ జనసేన ప్రచారం చేసింది. జేపీ నడ్డా తో పాటు హోంమంత్రి అమిత్ షాలను కలుస్తారంటూ జనసేన లీకులు ఇచ్చింది.
ఎవరితోనూ అపాయింట్‌మెంటు లభించకపోవడంతో ఆయన నిన్నటి నుంచి ఢిల్లీలోనే నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఈ పరిణామాలను బట్టి పవన్ ఆశించింది ఏమేరకు జరుగుతుందో చూడాలి. కొసమెరుపు ఏంటంటే.. రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని ఇప్పటికే బీజేపీ సీనియర్లు వెల్లడించాక కూడా మీరే దిక్కని పవన్ అక్కడికి చేరిపోవడం. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.