Begin typing your search above and press return to search.

బీజేపీతో ప‌వ‌న్ బేరం..ఆ ఒక్క‌టీ ఇవ్వాల‌ని విన్న‌పం?

By:  Tupaki Desk   |   17 Jan 2020 5:18 PM GMT
బీజేపీతో ప‌వ‌న్ బేరం..ఆ ఒక్క‌టీ ఇవ్వాల‌ని విన్న‌పం?
X
జ‌న‌సేన ఆవిర్భావం ద‌గ్గ‌ర నుంచి ఆ పార్టీ విష‌యంలో ప్ర‌జారాజ్యంతో పోలిక కొన‌సాగుతూ వ‌చ్చింది. అంత‌కు ముందే చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని పెట్ట‌డం - ముఖ్య‌మంత్రి పీఠాన్ని ల‌క్ష్యంగా చేసుకోవ‌డం - ఎన్నిక‌ల్లో చ‌తికిల‌ప‌డ‌టం జ‌రిగింది. ఎన్నిక‌లు అయిన కొన్ని నెల‌ల‌కే చిరంజీవి చేతులు ఎత్తేశాడు. పార్టీ జెండా పీకేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే మొద‌ట్లో ఆ ప్ర‌చారాన్ని ఖండించిన‌ట్టుగానే ఖండించి, ఆ త‌ర్వాత స‌మ‌యం చూసి కాంగ్రెస్ లోకి విలీనం అయిపోయారు చిరంజీవి.

అప్ప‌టికి కాంగ్రెస్ కు కూడా చాలా అవ‌స‌రం ఉంది. ఏపీలో ప్ర‌భుత్వం నిల‌బ‌డ‌టానికి చిరంజీవి అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటును ఆఫ‌ర్ చేసి విలీనం చేసుకుంది. చిరంజీవి కేంద్ర‌మంత్రి కూడా అయ్యారు. త‌ను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన తిరుప‌తి సీట్లో కూడా కాంగ్రెస్ ను గెలిపించుకోలేక‌పోయిన చిరంజీవి ఆ త‌ర్వాత నామినేటెడం పోస్టుతో కేంద్ర‌మంత్రి అనిపించుకున్నారు. తీరా కాంగ్రెస్ అధికారం కోల్పోవ‌డంతో.. ఆయ‌న ప‌ద‌వీ కాలం పూర్తి అయ్యింది.

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా మాత్రం ఆరేళ్ల పాటు కొన‌సాగి - రాజ‌కీయాల నుంచి వైదొలిగి త‌ప్పుకున్నాడు. ప్ర‌స్తుతం చిరంజీవి కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు అయితే దూరంగా ఉన్నాడు. మ‌రోవైపు ఏపీ సీఎం జ‌గ‌న్ తో చిరంజీవి కొంత స‌న్నిహిత‌
సంబంధాల‌నే నెరుపుతూ ఉన్నాడు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ బేరం కూడా అదేనని తెలుస్తోంది. ఇలా బీజేపీలోకి చేరాడో లేదో ప‌వ‌న్ క‌ల్యాణ్.. అప్పుడే క‌మ‌లం పార్టీ ద‌గ్గ‌ర త‌న మ‌న‌సు విప్పాడ‌ట‌. త‌న‌కు రాజ్య‌స‌భ సీటు కావాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరుతున్న‌ట్టుగా తెలుస్తోంది. అప్పుడే ఏపీలో త‌న‌కు కానీ, త‌న పార్టీకి కానీ ఊపు వ‌స్తుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీ పెద్ద‌ల ద‌గ్గ‌ర అభిప్రాయ‌ప‌డ్డాడ‌ట‌. త‌నను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయ‌డంతో త‌ను అధికారికంగా బీజేపీలోకి చేర‌డం, జ‌న‌సేన విలీనం కావ‌డం అయిపోతుంద‌ని.. అంత వ‌ర‌కూ ఫ్రెండ్స్ లా కొన‌సాగ‌డం అని అంటున్నాడ‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇలా విలీనానికి రాజ్య‌స‌భ సీటును ష‌ర‌తుగా పెట్టాడ‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్. గ‌తంలో కాంగ్రెస్ లోకి ప్ర‌జారాజ్యాన్ని విలీనం చేసి చిరంజీవి పొందిన రాజ్య‌స‌భ నామినేష‌న్ ను ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఇదీ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన క‌థ‌. ఈ మాత్రం బేరం కోస‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత ఆరాట‌ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పార్టీ క‌థ ప్ర‌జ‌లు ముందే తెలుసుకుని క‌నీసం ఎమ్మెల్యే గా కూడా ప‌వ‌న్ ను గెలిపించిన‌ట్టుగా లేరు.