Begin typing your search above and press return to search.
ఢిల్లీనుంచి చక్రం తిప్పనున్న పవన్ కల్యాణ్
By: Tupaki Desk | 28 Feb 2018 10:52 AM GMTహైదరాబాదులో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసి.. ఒక దశ వరకు వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం చేసిన పవన్ కల్యాణ్.. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేంత వరకు విశ్రమించే ఆలోచన లేదా? కేంద్రం మీద తాను ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం అనే ఆలోచన కార్యరూపం దాల్చే వరకు ఆయన ఊరుకోరా? అంటే అవుననే సమాదానమే ఆ పార్టీ వర్గాలనుంచి వినిపిస్తోంది. తెలుగు రాష్ట్ర్రాల్లోని పార్టీలను నమ్ముకోవడం కంటె.. మోడీ సర్కారుకు జడుపు పుట్టించాలంటే.. ఢిల్లీ కేంద్రంగానే రాజకీయం నడపడానికి పవన్ నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో చెలామణీ అవుతున్న వివరాలను బట్టి.. పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ అపాయింట్ మెంట్ కోరారు. ఆయనను నేరులో కలిసి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దే విషయంలో ఆయన సాయం కోరనున్నారు. విభజన పర్వానికి సంబంధించి ప్రధాన ద్రోహానికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ.. పవన్ కల్యాణ్ గతించిపోయిన సంగతిని విస్మరించారు. ఆ విషయం నిజనిర్ధాణ కమిటీ కూర్పులోనే బయటపడింది. ఆ సమావేశానికి ఆయన కాంగ్రెస్ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించారు. వారి అభిప్రాయాల్ని కూడా తెలుసుకున్నారు. తీరా అవిశ్వాసం అనే మాటను తాను ప్రతిపాదించిన తర్వాత.. తెలుగుదేశం అసలు ఏమాత్రం పట్టించుకోలేదనే బాధ పవన్ కల్యాణ్ లో ఉన్నదని పార్టీ వర్గాల సమాచారం. తన అభిప్రాయానికి తెలుగుదేశం పూచికపుల్లంత విలువ కూడా ఇవ్వలేదని ఆయన అనుకుంటున్నారట. అదే జగన్ అవిశ్వాసం పెడతా అంటున్నారు గానీ.. తాను చెప్పినట్లుగా మార్చి 4 లోగా పెట్టడానికి సిద్ధంగా లేకపోవడం పవన్ కు కోపం కలిగిస్తున్న మరొక అంశం.
ఈ నేపథ్యంలో కేవలం వీరిద్దరికి మాత్రమే తన అవిశ్వాసం ఆలోచనను ఎందుకు ప్రతిపాదించాలి. కాంగ్రెస్ ను అభ్యర్థించకూడదు.. అనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. తీర్మానం చర్చకు వచ్చేలా నెగ్గడానికి సరిపడా బలం యూపీఏ కు ఉంది. అందుకే రాహుల్ ను కలిసి ఆయన ద్వారా అవిశ్వాసం పెట్టించాలని పవన్ అనుకుంటున్నారట. ఎటూ మార్చి 4 లోగా జగన్ పార్టీ అవిశ్వాసం పెడితే.. రాహుల్ ను స్వయంగా కలిసి బలం సమీకరిస్తా అని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. అదేదో జగన్ పెట్టే తీర్మానం కోసం కాకుండా.. తనే రాహుల్ ద్వారానే తీర్మానాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన తాజా యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగిందంటే గనుక.. పవన్ కృషిని అందరూ శ్లాఘించక తప్పదు. అవిశ్వాసం విషంయలో మాటలే తప్ప.. చేతల గురించి చెప్పని తెదేపాకు చెంపపెట్టు అవుతుందని పలువురు అనుకుంటున్నారు.