Begin typing your search above and press return to search.
ఉండవల్లి గారు..రాజ్యసభకు వెళ్తారా!?
By: Tupaki Desk | 5 Feb 2019 6:17 AM GMTఈ మాటలు ఎవరన్నారు అనుకుంటున్నారా? లోక్ సభ మాజీ సభ్యుడు - రాజకీయ విశ్లేషకుడు - మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఎవరు రాజ్యసభకు పంపిస్తారు అనుకుంటున్నారా? ఇంకెవరు జనసేనాని పవన్ కళ్యాణ్. వెండితెర నుంచి జన క్షేత్రంలోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కు రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఎంతో గౌరవం ఉందంటారు. ఆ గౌరవంతోనే గతంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఒకట్రెండు సమావేశాలకు ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఆహ్వానించారని చెబుతారు. అలాగే ఇటీవల విజయవాడలో ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ముందు పవన్ కళ్యాణ్ నాయకులతోనూ - జనసేన కార్యకర్తలతో ను భారీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. అయితే, ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి ఒక్క ఫోన్ కాల్ రావడంతో ఆ సమావేశాన్ని రద్దు చేసుకుని హుటాహుటిన విజయవాడ వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని వెనుక ఉన్న కారణం ఉండవల్లి అరుణ్ కుమార్ పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఉన్న గౌరవమైన అని అంటున్నారు.
ఈ గౌరవానికి ప్రతీక గా భవిష్యత్తులో జనసేన నుంచి రాజ్యసభకు ఉండవల్లిని పంపించాలని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇతర రాజకీయ నాయకుల తో పోలిస్తే పవన్ కళ్యాణ్ లో ఓ పరిమితి కనిపిస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అనేక సార్లు చెప్పారు. దీంతో మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేన లో చేరాలని కళ్యాణ్ ఇంతకుముందే కోరారు. అయితే ఆ ఆహ్వానాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ సున్నితంగా తిరస్కరించారు. జనసేన ను ముందుకు నడిపించేందుకు అవసరమైన సలహాలు సంప్రదింపులు చేస్తానని - పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటానని ఉండవల్లి అప్పట్లో హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. రాజ్యసభ అంటే మేధావులకు నిలయమని - అలాంటి చోట ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నాయకులు ఉంటే జనసేన వాణి వినిపించవచ్చునని అది పవన్ కళ్యాణ్ ఆలోచనగా చెబుతున్నారు. భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు మరికొందరు మేధావులను అటు రాజ్యసభకు - ఇటు శాసన మండలికి పంపించాలని - దాని ద్వారా మేధావుల పట్ల తమ అంకితభావాన్ని ప్రజలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆఫర్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ సమ్మతిస్తారో - లేక తిరస్కరిస్తా వేచి చూడాలని జనసేన నాయకులు - కార్యకర్తలు అంటున్నారు.