Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ : స్వామీ నే చేసిన నేరమేమి..
By: Tupaki Desk | 8 Feb 2022 6:33 AM GMTసమతామూర్తి క్షేత్రానికి రాజకీయ నాయకుల సందర్శన పెరుగుతూ వస్తోంది.ఇదే సందర్భంలో రోజుకో మాట ప్రధాన స్రవంతిలో వివాదాలకు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.ఆ విధంగా బీజేపీ వర్సెస్ కేసీఆర్ వివాదం నడుస్తోంది.ఇప్పుడీ వివాదాన తన ప్రమేయం లేకుండానే పవన్ కల్యాణ్ ఇరుక్కుపోయారు.ఇప్పటికే పేర్లకుసంబంధించి రోజుకో మాట రోజుకో అస్త్రం సంధిస్తున్న బీజేపీ కి పవన్ తోడయ్యారా అన్న వాగ్వాదం నడుస్తోంది. బీజేపీ వాళ్లు భాగ్య నగరం పేరు ఫిక్స్ చేసి పవన్ నోటితో అనిపించారా ఏంటి?
ముచ్చింతల్ కేంద్రంగా చాలా వివాదాలే రగులుతున్నాయి.సమతామూర్తి సాక్షిగా చాలా వాదాలు వివాదాలు వినిపిస్తున్నాయి. విభేదాలు బలపడుతున్నాయి.నిన్నటి వేళ స్వామి సేవలో చాలా మంది రాజకీయ ప్రముఖులు తరించారు.ఆయన అనుగ్రహ భాషణ అందుకున్నారు.సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించుకుని, స్వామి దీవెనలు అందుకున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చాలా మంది వెళ్లారు.వారిలో వైఎస్ జగన్, చెవిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఇంకా ఇంకొందరు.అక్కడికి వెళ్లాక జగన్ తనదైన ధోరణిలో నాలుగు మాటలు చెప్పివచ్చారు.జగన్ పర్యటనకు సంబంధించి కొన్ని విషయాలు ట్రోల్ అవుతుంటే, జనసేనాని రాకకు సంబంధించి కీలక పదం ఒకటి నెట్టింట ట్రోల్ అవుతోంది.అదే భాగ్య నగరం.
వాస్తవానికి హైద్రాబాద్ అని పలికి తరువాత భాగ్య నగరం అన్న పదం ప్రస్తావనకు కూడా వచ్చింది.జగన్ స్పీచ్ లో ఇటువంటి పదాలేవీ రాకపోయినా పవన్ మాత్రం హైద్రాబాద్ పేరును భాగ్యనగరం అని పలకడంతో కొంత రచ్చ నెలకొంది.ఎందుకంటే బీజేపీ ఎప్పటి నుంచో హైద్రాబాద్ పేరు భాగ్యనగరంగా ప్రతిపాదిస్తూ మారుస్తామని అంటోంది.దీంతో పేరు మార్పులో భాగంగానే పవన్ ఆ విధంగా మాట్లాడారా లేదా యాదృశ్చికంగానే ఆయన ఆ విధంగా మాట్లాడారా అన్న వాదన ఒకటి నడుస్తోంది.
ఎందుకంటే బీజేపీకి,పవన్ కు మధ్య మంచి స్నేహ బంధాలే ఉన్నాయి కనుక వాటిని దృష్టిలో ఉంచుకుని పవన్ తన స్పీచ్ లో హైద్రాబాద్ పేరును భాగ్య నగరి అని పలికి వివాదానికి తెరలేపారా అన్నది ఓ సంశయంగానే ఉంది.