Begin typing your search above and press return to search.
టీవీ చానల్ కొంటున్న పవన్..అసలు నిజం ఇది
By: Tupaki Desk | 24 Jun 2018 5:58 AM GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న హాట్ హాట్ వార్తల జాబితాలో మరో వార్త చేరింది. సమాచారం పాతదే అయినప్పటికీ...కొత్త అప్ డేట్ తో వార్త చెలామణిలోకి వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త అంటే...`టీవీ చానల్ కొంటున్న పవన్`. చిత్రంగా గతంలో సాగినట్లే...తాజాగా అమ్మకానికి వచ్చింది కూడా కమ్యూనిస్టుల చానల్ కావడం గమనించాల్సిన విషయం! కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఎం నేతల చేతిలో మెజార్టీ వాట ఉన్న టీవీ ఛానల్ బేరం పెట్టగా ఈ విషయంలో పవన్ పేరు తెరమీదకు వచ్చింది.
వివరాల్లోకి వెళితే ఓ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతిస్తున్న మీడియాను ఢీకొన్న పవన్ తన సొంత మీడియా కోసం కసరత్తు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో గతంలో 99 టీవీ పేరుతో సీపీఐ నేతల చేతుల్లో ఉన్న ఓ టీవీ ఛానల్‌ను పవన్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయినట్లు ప్రచారం జరిగింది. డీల్ కుదిరిందని..చెల్లింపులే ఆలస్యమని వార్తలు చెలామణిలోకి వచ్చాయి. అయితే ఈ కొనుగోలు జరగలేదు. ఈ ఎపిసోడ్‌పై 99 టీవీ చానల్ కు చెందిన విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...జనసేనలో ఆర్థిక వ్యవహారాలు చూసే ఓ వ్యక్తి చివరి దశలో జోక్యం చేసుకోవడం వల్ల ఆ డీల్ ఆగిపోయింది. ఈ నిర్ణయం ఇటు జనసేన వర్గాలను, అటు 99 టీవీ సిబ్బందిని సైతం నిరాశ పరిచిందనేది నిజం.
ఇక తాజా ప్రచారం సంగతి చూస్తే...సీపీఎం నాయకుల ద్వారా మెజార్టీ వాటా, ప్రజల భాగస్వామ్యంతో మిగతా నిధులు సమకూర్చుకున్న 10టీవీ ఛానల్ ను పవన్ కొనబోతున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. సొంత మీడియా ఉండాలనే కసరత్తులో భాగంగానే ఈ ప్రణాళికలు సాగుతున్నాయని అంటున్నారు. ఓ ముప్పై కోట్లకు బేరం పెట్టారని చెప్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని..అంతేకాకుండా 10 టీవీ అమ్మకం అంత ఈజీ కాదని ఆ ఛానల్‌కు చెందిన ఓ కీలక స్థానంలోని వ్యక్తి ఒకరు తెలిపారు. ఇప్పటికే వాటాల రూపంలో నిధులు సమకూర్చిన వారు తమకు రావాల్సిన సొమ్ముల గురించి సంస్థను అడుగుతున్నారని ఆయన వెల్లడించారు. ఇప్పుడు అమ్మకం అంశం ముందుకు వస్తే...వారు కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. దీనివల్ల పవన్ టీం దీనిని కొనుగోలుకు జంకుతున్నారని తెలిసింది. అయితే, ఉంచుకుని ఇంకా నష్టాలు మూటగట్టుకోవడమా? అమ్మడమా అనేది ఏదో ఒకటి తేల్చుకునేందుకు ఇన్వెస్టర్లతో త్వరలో మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, అప్పటికి జనసేన మూడ్ ఎలా ఉంటుందో మరి!