Begin typing your search above and press return to search.
జగన్ ను చూసి పవన్ వాతలు పెట్టుకుంటున్నాడా?
By: Tupaki Desk | 6 Oct 2018 8:14 AM GMTకొద్దిరోజుల కిందట పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరిలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించినప్పటి సీను గుర్తుందా..? రాజమండ్రి బ్రిడ్జిపై జన గోదావరి పోటెత్తింది. అదో అఖండ వాహినిలా కనిపించింది. టీవీ చానళ్లలో - సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన వారు నోరెళ్లబెట్టారు. చివరకు టీడీపీ నేతలైతే గుండెలు అరచేత్తో పట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ జనం తమను ఓడించడం ఖాయమని అప్పుడే వారు ఫిక్సయిపోయారు.
ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అలాంటి ఫాలోయింగ్ తనకుందని ప్రదర్శించుకోవాలనుకుంటున్నారట. అదే గోదావరి వంతెనపై జన ప్రవాహం పొంగించాలనుకుంటున్నారట. కానీ... జగన్ లా పవన్ వెంట అంతమంది జనం వస్తారా అన్నదే ఇప్పుడా పార్టీలో ప్రశ్న. అందుకే... దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజమండ్రి పాత వంతెనపై తొలుత కవాతు చేయాలనుకున్నా ఇప్పుడు దాన్ని ధవళేశ్వరానికి మార్చారు. అది కూడా వారం రోజులు వాయిదా వేశారు.
రాజమండ్రి పాత బ్రిడ్జి మీద ఈనెల 9న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించతలపెట్టిన కవాతు తేదీ - ప్రాంతం మార్చేశారు. కవాతు తేదీ ఈనెల 9 నుంచి 15వ తేదీకి మార్చాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందుకోసం తూర్పుగోదావరి - పశ్చిమగోదావరి జిల్లాల నుంచి జనాన్ని తరలించే పని పెట్టుకున్నారు. మరి ఇదెంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.