Begin typing your search above and press return to search.

మోడీపై ప్రేమతో.. మీ పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   17 Sep 2021 6:30 AM GMT
మోడీపై ప్రేమతో.. మీ పవన్ కళ్యాణ్
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. విభిన్నంగా మారుతుంటుంది. అది 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు సమయం.. బీజేపీ తరుపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ దేశమంతా తిరుగుతూ సినీ, రాజకీయ ప్రముఖులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ఏపీకి వచ్చినప్పుడు కూడా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ చేతిలో చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ మద్దతు కోరాడు. పవన్ ఉన్నపళంగా మద్దతు ఇచ్చేశాడు. 2014లో అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు గెలిచాడు.

అయితే ఐదేళ్లలోనే విభేదాలతో వీరు విడిపోయారు. రెండోసారి గెలిచి మోడీ దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తిగా మారాడు. పవన్ ఢిల్లీ వెళ్లినా కూడా కలవనంతగా బిజీ అయిపోయారు. నాడు పవన్ ను అక్కున చేర్చుకున్న మనిషియే ఇప్పుడు పవన్ కు అందనంతగా ఎదిగాడు..

ఇక రెండో దఫా బీజేపీని కాలదన్ని కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయాడు. అదే సమయంలో బీజేపీ రెండోసారి అఖండ మెజార్టీతో గెలిచింది. దీంతో తత్వం బోధపడిన పవన్ కళ్యాణ్..తన పాత పగలు అన్ని పక్కనపెట్టి బీజేపీతో ఏపీలో పొత్తు పెట్టుకున్నాడు. ప్రస్తుతం కమలం పార్టీతో కలిసి సాగుతున్నాడు.

ఈరోజు సెప్టెంబర్ 17.. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు 71 వ పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లోకి వెళ్లారు.‘హ్యాపీడే మోడీజీ 'ఆది పరాశక్తి'

ఆశీర్వదించండి. మోడీ తన 71 వ పుట్టినరోజు సందర్భంగా దీర్ఘాయుష్షుతో మంచి ఆరోగ్యంతో ఉండాలి. మన భారత సాంస్కృతిక నైతికత.. వైవిధ్యాన్ని అర్థం చేసుకున్న మోడీ దేశానికి బలమైన నాయకుడు కావాలి అని నేను ఎప్పుడూ ఆకాంక్షిస్తున్నాను"అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

"2014 ఎన్నికల్లో మోడీతో తాను దగ్గరగా ప్రయాణించగలిగాను.. గౌరవంగా గమనించగలిగాను. నరేంద్రమోదీ జీ యొక్క ఆకర్షణీయమైన స్వభావం & డైనమిక్ నాయకత్వ నైపుణ్యాలు.

దేశం పట్ల ఆయన నిబద్ధత, అంకితభావం, నిస్వార్థ సేవ నిజంగా మనందరికీ స్ఫూర్తినిస్తుంది” అని పవన్ కొనియాడారు.

మొత్తంగా పవన్ కళ్యాణ్ మొదట దోస్తీ చేసి ఆ తర్వాత విభేదాలతో విడిపోయి.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తులో వెళుతూ బీజేపీ పెద్దాయన మోడీకి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన మిత్రుత్వాన్ని ఇలా చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తుం ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీకి పవన్ ఇలా శుభాకాంక్షలు తెలియజేశారు.