Begin typing your search above and press return to search.

మ‌హా కూట‌మి అంట‌!..సీఎం అభ్య‌ర్థి ప‌వ‌నంట‌!

By:  Tupaki Desk   |   2 July 2018 7:55 AM GMT
మ‌హా కూట‌మి అంట‌!..సీఎం అభ్య‌ర్థి ప‌వ‌నంట‌!
X
ఏపీలో నానాటికీ ఎన్నిక‌ల హ‌డావిడి పెరుగుతోంది. అయితే ఈ హ‌డావిడి మాట‌ల‌కు త‌ప్పించి చేత‌ల‌దాకా వెళ్ల‌డం లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ విష‌యంలో విప‌క్ష వైసీపీ ప‌క్క‌న‌పెడితే... మిగిలిన ఏ ఒక్క పార్టీలోనూ ఇదే త‌ర‌హా వైఖ‌రి క‌నిపిస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించినా తాము సిద్ధంగానే ఉన్నామ‌ని వైసీపీ ఇప్ప‌టికే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే మ‌ళ్లీ అధికారం త‌మ‌దేనంటూ అధికార టీడీపీ త‌న అనుకూల మీడియాతో స‌ర్వే చేయించుకుని జ‌బ్బ‌లు చ‌రుచుకున్నా... ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మాత్రం తాము వ్య‌తిరేక‌మ‌ని చెప్ప‌డ‌మే కాకుండా, ముందస్తు ఎన్నిక‌ల‌కు మేం వెళ్లేది లేద‌ని తేల్చి చెప్పేసింది. మొత్తంగా ముంద‌స్తు ఎన్నిక‌లంటే టీడీపీ భ‌య‌ప‌డుతోంద‌ని త‌న‌కు తానుగానే చెప్పేసుకున్న‌ట్టైంది.

ఇక కొత్త‌గా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న జ‌న‌సేన కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఏమాత్రం సిద్ధంగా లేద‌నే సంకేతాల‌నే ఇస్తోంది. ఎందుకంటే... ఆ పార్టీకి ఇప్ప‌టిదాకా సంస్థాగ‌త వ్య‌వ‌స్థే లేదు. అంతేకాకుండా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తార‌ని చెప్పుకొస్తున్న ఆ పార్టీ నేత‌లు... త‌మ నేత ఇంకా చాలా జిల్లాల్లో ప‌ర్య‌టించాల్సి ఉంద‌ని చెబుతున్నారు. ఈ లెక్క‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ మొత్తం జిల్లాల ప‌ర్య‌ట‌న పూర్తి చేస్తే గానీ... ఆ పార్టీ ఎన్నిక‌ల‌కు సంసిద్ధం కాలేద‌న్న మాట‌. ఇక లెఫ్ట్ పార్టీలు ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌న్న కోణంలో మాట్లాడుతున్నా... ప‌వ‌న్ క‌ల్యాణ్ తో జ‌త‌క‌ట్టి ముందుకు సాగాల‌ని ఉవ్విళ్లూరుతున్నట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఏ ఒక్క పార్టీతోనూ జ‌ట్టు క‌ట్టేది లేద‌ని, ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరుకే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్వ‌యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వామ‌ప‌క్షాలు కూడా ఇప్పుడు ప్ర‌త్యామ్నాయం చూసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ త‌రుణంలో వామ‌ప‌క్షాల్లోని ఓ ప‌క్షం అయిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ నిన్న క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌హా కూట‌మి అంటూ ఏర్ప‌డితే... ఆ కూట‌మి త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థిగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణే బ‌రిలోకి దిగుతార‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌న్‌ ను ఆకాశానికెత్తేస్తూ... ప్రజల్లో పవన్‌ కు ఇమేజ్‌ - క్రేజ్‌ రెండూ ఉన్నాయని - అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సీఎం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని కూడా రామ‌కృష్ణ... ప‌వ‌న్‌ కు ఓ మంచి కితాబే ఇచ్చారు.

అయినా ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేద‌ని ప‌వ‌న్ చెబుతుంటూ... సీపీఐ రామకృష్ణ ఏ లెక్క‌న ప‌వ‌న్‌ ను మ‌హా కూట‌మి సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదిస్తున్నారో కూడా అర్థం కాని ప‌రిస్థితి ఉంద‌న్న మాట వినిపిస్తోంది. పొత్తులు లేని పోరాటం చేస్తానంటూ ప‌వ‌న్ చెబుతుంటే... మ‌హా కూట‌మి అంటూ రామ‌కృష్ణ ప్ర‌క‌ట‌న చేయ‌డం, అది కూడా ఏర్పడుతుందో, లేదో కూడా తెలియ‌ని మ‌హా కూట‌మిని ఆయ‌న ప్ర‌స్తావించ‌డం చూస్తుంటే... ఏదో సామెత చెప్పిన‌ట్లుగా అనిపిస్తోంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఆలూ లేదు - చూలు లేదు... సీఎం పేరు ప‌వన్ క‌ల్యాణ్ అంటూ రామ‌కృష్ణ కామెడీ చేస్తున్న‌ట్లుగానే ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ‌కు తెర లేపాయ‌ని చెప్పాలి.