Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ చానెల్ వస్తోంది
By: Tupaki Desk | 28 Nov 2015 8:54 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ నాయకుడిగా ఆయనకున్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ప్రజల కోసం ప్రశ్నించేందుకు జనసేన పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం. ఆయన ఆలోచనలు అభిమానులకు మార్గదర్శకాలు.ఆయన మాట వేదం. రాజకీయాల్లోనూ ఆయన వ్యాఖ్యలు సంచలనాలు. అంతలా అభిమానుల్లో - రాజకీయవర్గాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పవన్ ఇపుడు కొత్తరూపంలో తెరమీదకు రానున్నారు.
పవన్ తన సినిమా లేదా రాజకీయాలకు సంబంధించిన అన్ని విషయాలను వీలయినప్పుడల్లా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజెప్తుంటారు. అపుడపుడు మీడియా ముందుకు వస్తుంటారు. అయితే ఇలా పవన్ నోటి నుండి లేదంటే ఆయన ట్విట్టర్ నుండి వచ్చే సమాచారం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. కానీ మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు తన సందేశాన్ని తెలిపేందుకు త్వరలో ఓ కొత్త ప్రయోగంతో పవన్ ముందుకు వస్తున్నాడని సమాచారం.
పవన్ యూ ట్యూబ్ ఛానల్ ను ప్రారంభించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్‌కు చెందిన సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన వీడియోలన్నీ ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది. ఇన్నాళ్లు ట్విట్టర్ లో తన భావాలను చెప్పిన పవన్ ,అవి కేవలం చదువుకున్న వారికే చేరుతున్నాయని భావించి ఈ క్రమంలో అందరికీ చేరువ అయ్యేందుకు ఈ యూ ట్యూబ్ ఛానల్ ప్లాన్ చేశారనే ప్రచారం జరుగుతుంది.
అయితే ఇటీవల దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన పలు వ్యాఖ్యలకు పవన్ రెస్పాండ్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. పవన్ ట్విట్టర్ ఒపీనియన్స్ చదువుకోని వాళ్ళకు ఎలా అర్థమవుతాయని కొద్ది రోజుల క్రిందట వర్మ ప్రశ్నించారు. దానికి సమాధానమే ఈ యూ ట్యూబ్ ఛానల్ అంటూ సినీ, రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎపుడు అధికారికంగా క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.