Begin typing your search above and press return to search.
పర్సనల్ గా తిడతారా? మీ చిన్నప్పటి చిట్టా కూడా తీయగలను జాగ్రత్త
By: Tupaki Desk | 9 May 2022 3:03 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో మరే అధినేతను టార్గెట్ చేయని రీతిలో లక్ష్యంగా చేసుకొని దారుణ వ్యాఖ్యల బారిన పడే వారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రమేనని చెప్పాలి. నన్ను ఒకటంటే.. నిన్ను నాలుగు అంటాననే వైఖరికి భిన్నంగా నిర్మాణ్మాతక వ్యాఖ్యలు చేసే పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ ను చెప్పొచ్చు. తన రాజకీయ జీవిత ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఉద్దేశించి.. ‘పంచెలు ఊడదీసి పరుగులు తీయిస్తా’ అన్న మాటలు అప్పట్లో సంచలనంగా మారాయి. కాకుంటే.. ఆ తీరుకు భిన్నంగా మాట్లాడుతున్న పవన్ ను తిట్టే క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ.. అవసరం లేకున్నా విమర్శలు చేసే క్రమం కనిపిస్తూ ఉంటుంది.
అలాంటి వారికి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. తనను నమ్మిన ఏ ఒక్కరిని మోసం చేయనని.. అందరికి అండగా నిలబడేవాడినన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటున్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే వైసీపీ నేతలకు ఈ సందర్భంగా భారీ వార్నింగ్ ఇచ్చేశారు. ‘‘వైసీపీ నాయకులు కూర్చొని నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. వాళ్లకు నేను ఒకటే చెబుతున్నా.. నేను నోరు తెరిచి మాట్లాడితే చాలా.. చాలా మాట్లాడగలను. మీ చిన్నప్పటి చిట్టా తీయగలను నేను. కానీ.. ప్రయోజనం ఏముంది దానికి? మిమ్మల్ని తిడితే మా కౌలు రైతు బిడ్డల కన్నీళ్లు తుడవగలుగుతానా? అలా అయితే మిమ్మల్ని తిడతాను.
కానీ.. ప్రయోజనం రాదే? అందుకే అలాంటి వాటిని మేం తిట్టం’’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఈ తరహా పరిపక్వత ఏపీ నేతల్లో కనిపించదనే చెప్పాలి. నిజం చెప్పాలంటే.. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలు దారుణంగా తయారయ్యాయన్న మాట అదే పనిగా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిని మార్చేసే నేతగా పవన్ కల్యాణ్ తీరు ఉంటుందని చెప్పక తప్పదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటికి ఎంత పని చెప్పటమే అంత మొనగాడితనంగా భావిస్తున్న రోజుల్లో.. అందుకు భిన్నంగా పవన్ మాటలు ఉంటున్నాయని చెప్పక తప్పదు. తాను పాలసీనే మాట్లాడతానని.. ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోవటం లేదని సంజాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మీరు బాగా చేస్తే శభాష్ అంటాం. మీరు బాగా పని చేసి శభాష్ అనిపించుకోండి. మీరు మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి శభాష్ అంటాం. జాబ్ క్యాలండర్ పూర్తి చేయండి.. శభాష్ అంటాం.
మీరు హామీ ఇచ్చిన సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు చేస్తామని చెప్పారు.. రద్దు చేయండి అప్పుడు శభాస్ అంటాం. ఏం చేయకుండా మీకు చప్పట్లు కొట్టాలంటే మేం మీకేమైనా భజనపరులమా?’’ అని తేల్చేశారు. పవన్ తాజా హెచ్చరిక తర్వాత వైసీపీ నేతలు పవన్ పై వ్యక్తిగత విమర్శల్ని ఆపుతారా? లేదంటే మరింత పెంచుతారా? అన్నది చూడాలి.