Begin typing your search above and press return to search.
నోట్ల రద్దుపై పవన్ ప్రశ్నించాడు
By: Tupaki Desk | 15 Dec 2016 5:30 PM GMTజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నోట్ల రద్దుపై స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇటీవల ఘాటుగా విమర్శిస్తున్న పవన్ తాజాగా ఇదే రీతిలో ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సంధించారు. కేంద్రంపై ఐదు ప్రత్యేక అంశాలను ఎంచుకొని తాను ప్రశ్నలు సంధించనున్నట్లు పవన్ ప్రకటించారు. పవన్ చేసిన ట్వీట్‌లను చూస్తే అన్నీ దేశాన్ని ఓ రేంజ్ లో అల్లాడించిన అంశాలే ఉండటం గమనార్హం.
కొద్దికాలం క్రితం దుమారం రేపిన గోవధ, హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, ఇటీవల చేసిన నోట్ల రద్దు, దేశభక్తి, ఏపీకి ప్రత్యేకహోదా అనే ఐదు అంశాలపై తాను గళం విప్పనున్నట్లు ప్రకటించారు. ఈ అంశాలపై అన్నివర్గాల విజ్ఞుల అభిప్రాయాలను తాను సేకరించినట్టు పవన్ వెల్లడించారు. ముందుగా మొదటి పాయింట్ అయిన గోవధ అంశాన్ని తీసుకుని బీజేపీ నేతలపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. గోరక్షణ కోసం ఎన్నో మాటలు చెప్తున్న బీజేపీ నేతలు- కార్యకర్తలు ఆవులను ఎందుకు దత్తత తీసుకోవడంలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గో చర్మంతో తయారు చేసిన తోలు బెల్టులు, చెప్పులను బీజేపీ నేతలు, కార్యకర్తలు ధరించకుండా ఎందుకు నిషేధించలేదని నిలదీశారు.
అన్నింటికంటే ముందుగా బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో గోవు మాంసాన్ని ఎందుకు నిషేధించలేదని పవన్ ప్రశ్నించారు. మరోవైపు హెచ్‌సీయూలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై శుక్రవారం ట్వీట్ చేయనున్నట్లు ప్రకటించారు.
కాస్త గ్యాప్ తీసుకొని తెరమీదకు వచ్చిన పవన్ చేసిన ట్వీట్లు ఇపుడు రాజకీయ వర్గాల్లో కలకలాన్నే సృష్టిస్తున్నాయి.