Begin typing your search above and press return to search.
నిజం తెలుసుకున్న పవన్.. జాగ్రత్తలు తప్పవుగా..!
By: Tupaki Desk | 21 Sep 2022 12:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీపై నిజాలు తెలుసుకున్నారా? పార్టీ పరిస్థితి ఆయన భావించిన ట్టు లేదని.. ఇప్పటికైనా.. నిర్ణయించుకున్నారా? అంటే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇటీవల పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ నేత.. నాదెండ్ల మనోహర్..మీడియా సమావేశం పెట్టి మరీ.. పార్టీ అధినేత పవన్.. వచ్చే దసరా నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని.. చెప్పారు. అంతేకాదు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేకతపై పోరాటం ప్రారంభిస్తారన్నా రు.
దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకేముంది.. తమ నాయకుడు ప్రజల మధ్యకు వచ్చేస్తున్నారు.. అని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా.. పవన్.. ఈ బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పట్లో బస్సు యాత్ర లేదని ఆయన పరోక్షంగా చెప్పారు. ఎప్పుడు యాత్ర ఉండేదీ త్వరలోనే చెబుతానన్నారు. అయితే.. అదేసమయంలో జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో నాయకులకు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చానన్నారు.
అంటే.. దీనిని బట్టి.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని.. జిల్లా స్తాయిలో ఎలా ఉన్నప్పటికీ.. మండల స్థాయిలో పార్టీ జెండాను పట్టుకునే నాయకులు కూడా లేరనే విషయాన్ని పవన్ గుర్తించారని..
పార్టీలోని కొందరు నాయకులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కొన్నాళ్లుగా వారు కూడా చెబుతన్నారు. ఇక, ప్రత్యర్థుల ధైర్యం కూడా ఇదే. ఎందుకంటే.. ఇప్పటి వరకు పవన్ ఒక్కరే పార్టీలో కీలకంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీని నడిపించేవారు.. ఎవరూ లేరు.
దీంతో పవన్ ఎంత అరిచినా.. ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా.. క్షేత్రస్థాయిలో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేవారు లేరనేది వైసీపీ నేతల వాదన. అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై పవన్ దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకునే నాయకులు..
సభ్యత్వం నమోదు.. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి బూత్ లెవిల్లో పార్టీని బలపేతం చేయడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలనేదిపవన్ వ్యూహంగా కనిపిస్తోంది. దీనిని జనసేన నాయకులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికైనా.. పవన్ క్షేత్రస్తాయిలో వాస్తవాలు తెలుసుకున్నారని.. నాయకులు అభిప్రాయపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.