Begin typing your search above and press return to search.
చంద్రబాబును టెన్షన్‌లోకి నెట్టేసిన పవన్?!
By: Tupaki Desk | 13 Jan 2023 7:45 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి టెన్షన్‌లోకి నెట్టేశారని అంటు న్నారు పరిశీలకులు. గతంలో విశాఖలో పవన్ పర్యటించిన సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకు న్నారు. హోటల్ రూమ్‌కే పరిమితం చేశారు. కనీసం.. బీచ్‌కు వెళ్తామన్నా.. అంగీకరించకుండా..నేరుగా విజయవాడకు పంపేశారు. ఈ క్రమంలో చంద్రబాబు... పవన్‌కు బాసటగా నిలిచారు. పవన్‌ను నిర్బంధించడాన్ని ఆయన ప్రశ్నించారు.
దీంతో పవన్-చంద్రబాబులు కలుసుకుని.. దాదాపు అరగంటకు పైగా చర్చించుకుని ఉమ్మడి ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి నడుస్తామన్నారు. దీంతో రెండు పార్టీలు ఎన్నికల పొత్తులపై ఒక నిర్ణయానికి వస్తున్నాయంటూ.. వార్తలు వచ్చాయి. విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. ఇంకేముంది.. వైసీపీని డిఫెన్స్‌లోకి నెట్టేశారని కూడా చెప్పుకొచ్చారు. కట్ చేస్తే.. ప్రధాని మోడీ విశాఖకు వచ్చారు. ఈ సమయంలో పవన్‌ను కలిశారు.
ఆ తర్వాత..అనూహ్యంగా రెండు నెలలపాటు.. చంద్రబాబు-పవన్‌ల మధ్య మౌనం తాండవించింది. టీడీపీతో పొత్తుపై నా అనేక అనుమానాలు వచ్చాయి. పొత్తు ఉండదనే సంకేతాలు ఇటు టీడీపీలోనూ రావడంతో అప్పటి వరకు సమర్ధించిన తమ్ముళ్లు పవన్ విషయంలో మౌనంగా ఉండిపోయారు.
కట్ చేస్తే.. కుప్పంలో చంద్రబాబును పోలీసులు నిలువరించారు. దరిమిలా.. ఇటీవల వారం రెండు వారాల కిందట.. పవన్ నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లడం.. మళ్లీ కలిసి పనిచేయాలని రోడ్ మ్యాప్ రెడీ చేసుకోవడం తెలి సిందే.
దీంతో మళ్లీ టీడీపీ-జనసేన పొత్తు పై మరిన్ని విశ్లేషణలు వచ్చాయి. అంతేకాదు.. పవన్ సుమారు 30 నియోజకవర్గాలు కోరుకుంటున్నారంటూ.. ఆయా పేర్లతో సహావిశ్లేషణలు వచ్చాయి. ఇక, ఈ పరిణామం.. టీడీపీలోనూ జోష్ నింపింది. ఇంకేముంది.. వచ్చే ఎన్నిక్లలో పవన్ - బాబు కలిసి పోటీకి సిద్ధమవుతున్నా రనే సంకేతాలు ఇచ్చేశారని చర్చలు కూడా జరిగాయి. కట్ చేస్తే..యువశక్తి సభ వేదికగా.. రణస్థలం నుంచి పవన్ చేసిన ప్రకటన మరోసారి చంద్రబాబును టీడీపీ నేతలను డోలాయమానంలో పడేశాయి.
''మీరు నావెంట ఉంటానని అంటే.. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తా'' అంటూ.. పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చాయి. పొత్తులు పెట్టుకునే వారు ఎవరూ కూడా ప్రజలను అడగాల్సినఅవసరం లేదు. పొత్తులు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు .. దానికి దారి తీసిన పరిస్థితులను వారికి వివరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, పవన్ మరోసారి ఇలా వ్యాఖ్యానించేస రికి అసలు పవన్ వ్యూహం ఏంటనేది టీడీపీకి అంతుచిక్కకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.