Begin typing your search above and press return to search.
ఈ దేశానికి మోడీ, షా లే కరెక్ట్ ... పూర్తిగా తెగించేసిన పవన్ !
By: Tupaki Desk | 4 Dec 2019 4:52 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్టీ నిర్మాణం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లా పర్యటనలు చేస్తూ జనసేన పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి అన్ని పనులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం జనసేనాని రాయలసీమ జిల్లాలో తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ తరుణం లో తిరుపతిలో రెండో రోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ఈ దేశానికి మోడీ , షా లే కరెక్ట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ ఎప్పుడు , ఎవరిని కరెక్ట్ అని అంటారో ఎవరి కీ అర్థం కావడం లేదు. అలాగే ఈ సమావేశంలో మాట్లాడుతూ ... పలు సంచనల వ్యాఖ్యలు చేసారు.
నేను సినిమా హీరోని అని , తనకి కష్టాలు ఏమి లేవని , సుఖమైన జీవితం నుంచి వచ్చానని తెలిపారు. సుఖమైన జీవితాన్ని వదులుకుని ఎందుకు కష్టాలు పడుతున్నావని తమ తల్లి కూడా అన్నారని గుర్తు చేసుకున్నారు. ఒక మనిషి కష్టాల్లో ఉంటే తాను కళ్లుమూసుకుని, కళ్లకు గంతలు కట్టుకుని ఉండలేనని , నేను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ మారోసారి స్పష్టం చేశారు. తాను మాట్లాడుతుంటే.. తన తలకాయ ఎగిరిపోతుందని తెలిసినా మాట్లాడుతున్నానని అన్నారు. కులాన్ని, మతాన్ని ప్రాంతాన్ని ఇష్టా రాజ్యానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వారే దేశానికి అవసరమని, కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అమిత్ షా ఉక్కుపాదంతోనే మాట్లాడతారని అన్నారు.
రాయలసీమ లోకి ఎవరూ రావొద్దని దోరణి తో కొన్ని గ్రూపులు ఇక్కడున్నాయన్నారు. ఎవర్ని పొడిచినా రక్తమే వస్తుందని.. తన తలకాయ ఎగిరి పోతే పర్లా అనేంత గుండె ధైర్యంతో వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. బీజేపీ లాంటి పెద్ద పార్టీలున్నాయని.. పెద్ద నాయకులున్నారని.. దశాబ్ధాలపాటు కొనసాగిన సంస్థాగత ఏర్పాట్లు మన పార్టీ కి ఇంకా లేవన్నారు. దేశం మీద ప్రేమతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎంత పిచ్చి అంటే.. నిస్సహాయతతో ఎన్నో రాత్రులు ఏడ్చానని , అదే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది అని తెలిపారు. ఒక్కోసారి ఏదైనా ఎస్టాబ్లిష్డ్ పార్టీలో ఉంటే బాగుంటుందేమోనని అనిపిస్తుంది అని అన్నారు. కానీ, కష్టంగా ఉన్నా తాను పార్టీ ని కొనసాగిస్తున్నానని చెప్పారు.