Begin typing your search above and press return to search.

విశాఖ నుంచే పవన్ మార్క్ సంచలనం... ?

By:  Tupaki Desk   |   6 Nov 2021 6:45 AM GMT
విశాఖ నుంచే  పవన్ మార్క్ సంచలనం... ?
X
పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. ఆయన గేర్ మార్చారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే రాజకీయాల నుంచి మెల్లగా బయటకు వస్తున్నారు. అందుకే ఆయన అక్టోబర్ నెలలో ఏపీలో బాగా టూర్లు వేశారు. ఇపుడు నవంబర్ లో కూడా పవన్ పొలిటికల్ షెడ్యూల్ చూస్తే టైట్ గానే ఉండేట్టుంది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద పవన్ గట్టిగా ఉన్నారు. ఆయన అక్టోబర్ 31న విశాఖలో జరిగిన సభలో మాట్లాడుతూ అధికార వైసీపీ సర్కార్ కి డెడ్ లైన్ పెట్టారు. వారం రోజుల్లో అఖిల పక్షం వేయాలని, లేకపోతే తమ యాక్షన్ ప్లాన్ ఏంటో చూపిస్తామని చెప్పారు. ఇపుడు ఆ గడువు ముగియనుంది. దాంతో అందరి చూపూ పవన్ మీదనే ఉంది.

మరో వైపు చూస్తే పవన్ డిమాండ్ చేసినట్లుగా అఖిల పక్ష సమావేశానికి వైసీపీ సర్కార్ సుముఖంగా ఉందా లేదా అన్నది తెలియడంలేదు. పవన్ డిమాండ్ మీద మంత్రులు విమర్శలు చేశారు తప్ప అఖిల పక్షం ఊసెత్తలేదు. ఇంకో వైపు చూస్తే పవన్ జగన్ కి డెడ్ లైన్లు పెట్టడమేంటి అని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు కూడా. పవన్ కి సత్తా ఉంటే మోడీకి ఆ డెడ్ లైన్లు పెట్టాలని సవాల్ చేశారు. ఈ నేపధ్యంలో వైసీపీ పవన్ చెప్పినట్లుగా చేయడానికి సిద్ధంగా లేదని అర్ధమవుతోంది. దాంతో పవన్ మార్క్ పాలిటిక్స్ ని మరో మారు చూపించాలని జనసేనాని డిసైడ్ అయ్యారని అంటున్నారు.

సరిగ్గా రెండేళ్ల క్రితం విశాఖలో పవన్ ఆద్వర్యాన ఇసుక కొరత మీద లాంగ్ మార్చ్ నిర్వహించారు. దానికి మంచి స్పందన లభించింది. ఇపుడు కూడా అదే తరహాలో మరోసారి లాంగ్ మార్చ్ లాంటిది నిర్వహిస్తారా అన్న చర్చ కూడా వస్తోంది. అయితే ఈసారి జనసేన మాత్రమే కాకుండా ఇతర విపక్షాలను కూడా కలుపుకుని స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద విశాఖ నడివీధుల్లోనే భారీ ఆందోళనకు జనసేన ప్లాన్ చేయలనుకుంటోందని టాక్. అదే కనుక జరిగితే వైసీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లు అవుతుందని, అదే టైమ్ లో తమ చిత్త శుద్ధిని చాటుకున్నట్లుగా ఉంటుందని కూడా పవన్ భావిస్తున్నారుట. మొత్తానికి పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మీద మరింత దూకుడుగా పోరాటం చేస్తారని అంటున్నారు. మొత్తానికి పవన్ స్టీల్ ప్లాంట్ ఇష్యూతో ముందుకు వెళ్తే అది జనసేనకు ఈ ప్రాంతంలో మంచి పొలిటికల్ మేఇలేజ్ తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంది. అదే టైమ్ లో అధికార పక్షం ఇరుకున పడుతుంది అంటున్నారు. చూడాలి మరి పవన్ విశాఖలో మళ్లీ లాంగ్ మార్చ్ అంటే ఏపీ రాజకీయల్లో ఆ రీ సౌండ్ ఎలా ఉంటుందో.