Begin typing your search above and press return to search.
‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ వేడుకలో ఏపీ సర్కారుపై పవన్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 26 Sep 2021 4:05 AM GMTసినిమా ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది? వివాదాలకు.. రాజకీయాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటూ.. రోటీన్ సినిమాలకు భిన్నంగా తాము ఎలా తీశామన్న మాటలు చెబుతూ.. సినిమాను ప్రమోట్ చేసుకునే కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో సినిమాకు హైప్ పెంచేందుకు ఎవరి వంతు ప్రయత్నం వారు చేస్తుంటారు. ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది సాయిధరమ్ తేజా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ మాత్రం ఎవరూ ఊహించలేని రీతిలో సాగింది. ఈ ప్రోగ్రామ్ కు ముఖ్యఅతిధిగా హాజరైన పవన్ కల్యాణ్.. సినిమాను నామమాత్రంగా ప్రస్తావించి.. తన ప్రసంగం మొత్తాన్ని సంచలన వ్యాఖ్యలతో నింపేయటమే కాదు.. ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ఏకేశారు.
తన కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారన్న పవన్.. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాల్ని తూర్పార పట్టారు. తీవ్ర విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లలో ఏ మాత్రం కనిపించని కొత్త తరహా వాతావరణం పవన్ స్పీచ్ తో నెలకొంది. ఇంతకూ పవన్ ఏం మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఏమిటన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
- సినిమా విడుదల ముందు సాయితేజ్ ప్రమాదానికి గురికావడం బాధాకరం. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి.. సాయితేజ్. అతను ఆస్పత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చా. అతివేగమే సాయితేజ్ ప్రమాదానికి కారణమని ప్రచారం చేశారు. సాయితేజ్ రోడ్డుప్రమాదంపై లేనిపోని కథలు అల్లారు. ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కింద పడ్డాడు. సినిమాలో చెప్పిన విలువలు నిజ జీవితంలో అమలుచేయడం కష్టం. సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు, కళ్లు తెరవలేదు. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ఏవేవో మాట్లాడుతున్నారు. దాని కంటే కూడా ప్రజలకు పనికి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి.
- పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తే.. అతను నటించిన సినిమాలు ఆపేస్తే భయపడి కాళ్ల దగ్గరకు వస్తారని అనుకుంటున్నట్టున్నారు. వాళ్లు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. నేనయినా, దర్శకుడైనా, నటులైనా చేసిన సినిమాలకే డబ్బులు తీసుకుంటున్నారు.. అడ్డగోలుగా వేల కోట్లు మాత్రం సంపాదించలేదు.. తప్పుడు కాంట్రాక్టులు చేసి సంపాదించలేదు. జనాలను ఎంటర్ టైన్ చేసి డాన్సులు వేసి కిందా మీద పడి.. ఒళ్లువిరగ్గొట్టుకుని కృషి చేస్తే డబ్బులు వస్తున్నాయి..
- కోట్లాది రూపాయిల పెట్టుబడితో సినిమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తానంటోంది.. కష్టం మేము పడితే టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా? చిత్ర పరిశ్రమ చిన్నది అనుకుంటున్నారేమో? దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద పేర్లు ఉన్నవారు ఉన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకుల్ని మూసుక్కూర్చోమని చెప్పలేరా? ఇండస్ట్రీ వైపు చూడొద్దని చెప్పలేరా.. మాట్లాడేందుకు మీకు ధైర్యం లేదా
- భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్. వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారు. అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతారు. అధికారంలో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి.
- ఇరవై ఏళ్ల పాటు తిరుగులేని రీతిలో లిబియాను పాలించిన గఢాఫీ లాంటి నేత చేసిన తప్పులకు మూల్యం చెల్లించేలా.. ఆ నియంతను ఒక చిన్న ఊళ్లో అక్కడి చిన్న కుర్రాళ్లు వీధుల్లో తరుముకుంటూ కొట్టి చంపేశారు. అందుకే ఎవరికి వారు వారి హద్దుల్లో ఉండాలి.
- మీడియా దృష్టి పెట్టాల్సింది సినిమా వాళ్ల మీద కాదు.. అక్రమ అర్జిత రాజకీయ నాయకుల మీద.చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైన అంశం. అందుకే చాలా తేలిగ్గా టార్గెట్ చేసేస్తున్నారు. ఉదాహరణకు తేజుకి బైక్ యాక్సిండెట్ అయితే దాని మీద విపరీతార్ధాలతో కథనాలు వేశారు. దేశంలో ఇంతకంటే ఇంట్రస్టింగ్ కథనాలు లేవా? మీకు నేనే కొన్ని ఇంట్రస్టింగ్.. స్పైసీ స్టోరీలు చెబుతా.
- వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు అనే దాని మీద మాట్లాడండి. కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో పోడిస్తే నాటి గవర్నర్ గారు సైతం దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. ఆ కేసు ఏమైందో అడుగుతూ స్టోరీ చేయండి. చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్న కథనాన్ని చేయొచ్చు కదా? లక్షలాది ఎకరాల పోడు భూముల్లో గిరిజనలు వ్యవసాయం చేసుకుంటుంటే అవి వారికి దక్కడం లేదు.. ఎందుక దక్కడం లేదనే అంశం మీద మాట్లాడండి.
- ఆరేళ్ల చిన్నారిని అన్యాయంగా, అమానుషంగా హ్యత చేస్తే దాన్ని వదిలేసి తేజ్ 45 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లిపోయాడనే దాని మీద కథనాలు ఎందుకు? బాగా స్పైసీగా కథనాలు కావాలంటే ఈ మధ్య వైసీపీ సానుభూతిపరులు కొందరు వ్యభిచారాన్ని చట్టబద్దం చేయమంటూ బయటకు వచ్చారు. దాని మీద కథనాలు నడపండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారో కథనాలు వేయండి.. బోయ కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావడం లేదో దాని మీద కథనాలు నడపిండి.. నేను గౌరవిస్తాను.
- ఇడుపులపాయలో ఉన్న నేలమాళిగల్లో టన్నుల కొద్ది డబ్బుల కట్టలు ఉంటాయని పోలీసు వారు చెప్పుకుంటుంటే విన్నా దాని మీద కథనాలు నడపండి. అలా స్టోరీలు చేయగలరా? అలా చేస్తే.. వాళ్లు ఇళ్లల్లోకి వచ్చి కొడతారు.. అందుకే వాళ్ల గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాత్రమే మాట్లాడుతారు. అతను అమాయకుడు ఏం చేయలేడు కాబట్టి. మీడియాకు ధైర్యం ఉంటే రాజకీయ హింస గురించి మాట్లాడాలి. సినిమా వాళ్ల గురించి కాదు.. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి.
- సినిమా వాళ్లు అంటే తైతక్కలు వేసేవాళ్లు అని మాట్లాడుతున్నారు.. సినిమా తీయడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ తత్వానికి, కుల తత్వానికి స్థానం లేదు. ఏ పార్టీ సానుభూతిపరులు ఉన్నా మీకు అన్నం పెడుతున్న పరిశ్రమకు ముందు గౌరవం ఇవ్వండి. చిత్ర పరిశ్రమ జోలికి వస్తే అంతా ఏకమవ్వండి. నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి. మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా . సినిమాలపై ఆధారపడి హైదరాబాద్ లోనే లక్షల మంది బతుకుతున్నారు.
- ఏపీ మంత్రి సినిమా పెద్దలు వెళితే సోదరబావం అంటారు? సోదరభావం ఏమిటి సన్నాసి? ఆయన పేరేమిటి? సన్నాసుల పేర్లు గుర్తుండవు.
- మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదు. పోటీ తత్త్వం. బాహుబలి పెద్ద హిట్ అయితే బాధ పడను. సంతోష పడతా. వేరే దర్శకుడి సినిమాలు విజయవంతమైతే ఆనందిస్తా. విడిగా అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. కానీ.. సమస్య వచ్చినప్పుడు అందరూ ఏకం కావాలి. ప్రకాశ్ రాజ్ తో పొసగదు. కానీ.. షూటింగ్ లో ఆయన నందా అయితే నేను సత్యదేవ్. ఇద్దరం బాగా మాట్లాడుకుంటాం. పలుకరించుకుంటాం. కానీ.. రాజకీయ విధానాలు వేర్వేరుగా ఉండొచ్చు. ఆయన మా ఎన్నికల్లోపోటీ చేస్తానంటే.. లోకల్.. నాన్ లోకల్ ప్రస్తావన తెచ్చారు. ఇది తప్పు. ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇలా మాట్లాడటం సరికాదు. ఆయన గెలుస్తారా? లేదా? అన్నది తర్వాత. ఆయన స్థానికుడు కాదన్న ప్రచారం మాత్రం మంచిది కాదు. మేం అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం లేదు. కష్టపడి నటిస్తేనే మాకు డబ్బులు వస్తాయి. అక్రమార్జిత రాజకీయ నాయకుల గురించి మాట్లాడండి. ట్యాక్స్ లు కట్టని వారి గురించి మాట్లాడండి.. మా గురించి కాదు.
- పవన్ సనిమాలను ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ వాళ్లు అనుకుంటున్నారు. చిత్రపరిశ్రమ వైపు చూస్తే వైసీపీ వాళ్లు కాలిపోతారు. ఇండస్ట్రీ వైపు చూడొద్దని వైసీపీ వాళ్లకు ఎందుకు చెప్పడం లేదు. అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పు అని మనం చెప్పాలి . ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటి? ఇది వైసీపీ రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారు . సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవు . సినీ పరిశ్రమ జోలికి వస్తే మనమంతా కలవాలి. నేను ఎవరి కులం చూడను.. వ్యక్తిత్వానికే విలువ ఇస్తా .
- నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి. మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా . వారి సినిమాల్ని వదిలేయండి. మరి.. మన సంగతి ఏమటి? మన సినిమాల మాటేమిటి? అంటారా? మన సినిమాల్ని ఆపుతే ఊరుకుంటామా?
- సినిమావాళ్ల కష్టాలపై సోదరులు మోహన్ బాబు మాట్లాడాలి. చిత్ర పరిశ్రమ గురించి మోహన్ బాబు వైసీపీ నేతలకు చెప్పాలి. వారికి.. వారికి బంధురికం ఉందని విన్నాను. సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్ముతామని చెబుతోంది. రేపొద్దున ఇవే నిబంధనలు మోహన్ బాబు విద్యాసంస్థలకూ వర్తిస్తే ఏం చేస్తారు? మీ వాళ్లే కదా.. ఏపీ ప్రభుత్వాధినేతతో సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలి. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టే సినిమా టికెట్లు అమ్మే ఆలోచన. సినిమా టికెట్ల ఆదాయం చూపించి బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. అందుకే అలాంటి ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు.
- తెలుగు చిత్ర పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం తీరు మారాలి. మీ వైఖరి మార్చేందుకు ఏం చేయాలో మాకు తెలుసు. తెలుగు చిత్రపరిశ్రమను ఎవరూ అడ్డుకోలేరు. ఆపలేరు.