Begin typing your search above and press return to search.

చాలా తెలివిగా మాట్లాడిన పవన్

By:  Tupaki Desk   |   20 Oct 2021 4:25 AM GMT
చాలా తెలివిగా మాట్లాడిన పవన్
X
మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు చేయటంలో కానీ మాట్లాడటంలో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా దూకుడు మీదుంటారు. తాను చేస్తున్న ఆరోపణలు, విమర్శల్లో లాజిక్ ఉందా లేదా అనేది కూడా పవన్ చూసుకోరు. కారణం ఏమిటంటే జగన్ పై ఆరోపణలకు, విమర్శలకు అవకాశం వస్తే చాలునుకోవటమే. ఏ అవకాశము రాకపోతే తనంతట తానుగా అవకాశాలను సృష్టించుకున్న సందర్భాలు కూడా గతంలో అనేకం ఉన్నాయి.

సరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే టీడీపీ నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతు జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరు చూసిందే. సీఎంను పట్టుకుని పట్టాభి బోసిడీకె, అరేయ్, ఒరేయ్ అని చాలా పరుషంగా మాట్లాడారు. గతంలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా జగన్ను పట్టుకుని చాలా అసభ్యంగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా పట్టాభి మాట్లాడిన మాటలకు వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడలు చేశారు.

జరిగిన దాడుల్లో ఎక్కువ భాగం తమ కార్యాలయాలపై తామే టీడీపీ నేతలు దాడులు చేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సరే దాడుల విషయంలో ఏమి జరిగినా ఇక్కడ పవన్ స్టాండ్ మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది. దాడులు నిజంగానే జరిగుంటే అవి ప్రజాస్వామ్యానికి మంచివి కావని మాత్రమే అన్నారు. దాడులు నిజంగానే జరిగుంటే అని పవన్ అనటంలో అర్ధమేంటి ? అంటే టీడీపీ ఆఫీసులపైన జరిగిన దాడులన్నీ వైసీపీ నేతలు చేసింది కాదని పవన్ అనుమానపడుతున్నారా ?

అలాగే తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులు చేయటాన్ని ఖండిస్తూ చంద్రబాబునాయుడు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపిచ్చారు. ఈ బంద్ విషయాన్ని పవన్ ఏ మాత్రం ప్రస్తావించలేదు. టీడీపీ పిలుపిచ్చిన బంద్ కు తాను మద్దతిచ్చే విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించలేదు. జగన్ను టీడీపీ నేత పట్టాభి నోటికొచ్చింది మాట్లాడటం తప్పని పవన్ కు కూడా అర్ధమయ్యుంటంది. మామూలుగా చంద్రబాబు ఏమి చెప్పినా తాన అంటే తందాన అనే పవన్ ఈ విషయంలో మాత్రం చాలా ఆచితూచి మాట్లాడటం గమనార్హం.