Begin typing your search above and press return to search.
మంచి చాన్స్ మిస్ చేసుకున్న పవన్... ?
By: Tupaki Desk | 1 Nov 2021 11:54 AM GMTరాజకీయాల్లో కొన్ని సార్లు గోల్డెన్ చాన్సులు వస్తూంటాయి. అవి పరిస్థితులే ఇస్తాయి. వాటిని ఒడుపుగా వాడుకుంటే ఇక నాయకులకు తిరుగు ఉండదు. పవన్ కి అలాంటి చాన్సే విశాఖ స్టీల్ ప్లాంట్ రూపంలో వచ్చింది. నిజానికి ఈ ఉద్యమం గత తొమ్మిది నెలలుగా సాగుతోంది. ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయవద్దు అని ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. వారికి రాజకీయ పార్టీల నుంచి మద్దతు అంతంత మాత్రంగానే ఉంది అన్నది పచ్చి నిజం. అధికారంలో ఉన్న వైసీపీ మొక్కుబడిగానే వ్యవహరించింది అన్న విమర్శలు ఉన్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అయితే రెచ్చిపోవాల్సిన చోట ఎందుకో ఆచీ తూచీ అడుగులు వేసింది. ఇపుడు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి టీడీపీ పెద్దగా మాట్లాడడం లేదు. మొత్తానికి అది తమ సమస్య అనుకుని కార్మిక లోకమే బరువుని మోస్తున్నారు.
సరిగ్గా ఈ సమయంలో పవన్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. పవన్ వంటి నేత, సినీ చరిష్మా కలిగిన వారు, పైగా బీజేపీకి మిత్రుడు వచ్చి తమకు మద్దతు ఇస్తే పోరాటం మరో మేలి మలుపు తిరగడం ఖాయమనే భావించారు. అందుకే రాజకీయాలకు అతీతంగా అంతా పవన్ రాకను బలంగా కోరుకున్నారు. జనసేన నుంచి బయటకు వచ్చేసిన జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు అయితే పవన్ చేస్తున్న పోరాటానికి వెల్ కమ్ చెప్పారు. ఉక్కు కార్మికులు వేయి కళ్ళతో పవన్ కోసం ఎదురుచూశారు.
అయితే పవన్ ఉక్కు కార్మిక పోరాటానికి మద్దతు ఇస్తూనే తన బాణాలను వైసీపీ మీద ఎక్కు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానిదే మొత్తం తప్పు అన్నట్లుగా ఆయన దూకుడు చేశారు. సరే ఏపీ సర్కార్ ని ఆయన విమర్శించడంలో తప్పు లేదు, కానీ అదే మోతాదులో కేంద్రాన్ని కూడా గట్టిగా నాలుగు తగిలించి ఉంటే కచ్చితంగా పవన్ కి బ్రహ్మాండమైన పొలిటికల్ మైలేజ్ దక్కేదని విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే అంతా కాడె వదిలేసిన చోట పవన్ ఒక్కరే దిక్కు అని కార్మిక లోకం మొత్తం ఆశించిన చోట పవన్ తనలోని ఫైర్ ని టోటల్ గా కేంద్రం మీద ప్రయోగిస్తే కచ్చితంగా ఉక్కు పోరాటం కొత్త రూపు తీసుకునేది అన్నది మేధావుల భావన కూడా.
విశాఖ ఉక్కు విషయంలో పూర్తి హక్కులు కేంద్రానికే ఉన్నాయి. ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ ఎవరి మాటా వినకుండా ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగిపోతోంది. ఈ విషయంలో ప్రజాబలమే ఈ నిర్ణయాన్ని ఆపాలి. అలాంటి ప్రజాబలం ఉన్న నేత పవన్ కనుక గట్టిగా గర్జించి ఉంటే కేంద్రం నుంచి ఏమైనా పునరాలోచన వచ్చే చాన్స్ ఉండేది. సరే కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది పక్కన పెడితే పవన్ చిత్త శుద్ధి కూడా లోకానికి తెలిసేది. అదే విధంగా విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో జనసేనకు అదే మంచి ఊపు ఇచ్చేది. ఒక విధంగా ఆ పార్టీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ ఎందుకో పవన్ బీజేపీని పక్కన పెట్టేశారు. ఆయన రాజమండ్రీ సభకూ విశాఖ సభకూ అందుకే తేడా లేకుండా పోయింది అన్న కామెంట్స్ పడుతున్నాయి. మొత్తానికి పవన్ ఒక మంచి చాన్స్ మిస్ అయ్యారని కూడా టాక్ అయితే ఉంది.