Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ గెలుపు వ్యూహం.. మూడు ఆప్ష‌న్లు..ఇవే!

By:  Tupaki Desk   |   21 July 2022 12:30 AM GMT
ప‌వ‌న్ గెలుపు వ్యూహం..  మూడు ఆప్ష‌న్లు..ఇవే!
X
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపై తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని.. జ‌న‌సేన వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నా యి. ఎందుకంటే.. ముందు ఆయ‌న ప‌టిష్టంగా ఉంటే.. పార్టీని డెవ‌ల‌ప్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకే.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను ప‌క్క‌న పెట్టి.. ఇప్పుడు కొత్త‌గా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని.. ఆలోచిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల‌.. పార్టీ క్రియాశీల‌క నాయ‌కుడు.. నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుసుకున్నారు.

జ‌న‌సేన కు ఉన్న ప‌రిస్థితిని తెలుసుకున్నారు. అదేస‌మ‌యంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లి గూడెంలోను.. ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ రెండు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేసేందుకు అవ‌కాశం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలుగా జ‌న‌సేన భావిస్తోంది.

తిరుప‌తిలో జ‌న‌సేన‌కు గ్రాఫ్‌బాగానే ఉంద‌ని.. మ‌నోహ‌ర్‌కూడా భావిస్తున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో ఇదే వెల్ల‌డైంది. దీనికి కార‌ణం.. గ‌తంలో ఇక్క‌డ నుంచి 2009 ఎన్నిక‌ల్లో తిరుప‌తి నుంచి .. మెగా స్టార్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ మెగా అభిమానులు ఎక్కువ‌గా ఉండ‌డం క‌లిసివ‌స్తోంది.

ఇక‌, మ‌రోవైపు.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెంలోనూ.. కాపులు ఎక్కువ‌గా ఉన్నారు. వీరితో పాటు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం కూడా డామినేట్ చేస్తోంది. క్ష‌త్రియ వ‌ర్గం.. ప‌వ‌న్‌కు సానుకూలంగానే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి పోటీ చేసిన‌.. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు అన్ని ఓట్లు రావ‌డం వెనుక క్ష‌త్రియ వ‌ర్గం చొర‌వ ఉంద‌నే అంచ‌నాలు వున్నాయి. సో.. తాడేప‌ల్లి గూడెం కూడా ప‌వ‌న్‌కు అనుకూలంగానే ఉంటుంద‌ని.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ రెండింటి క‌న్నా.,. మెరుగైన నియోజ‌క‌వ‌ర్గంపైనా.. చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో జ‌న‌సేన దృష్టి విశాఖ‌లోని భీమిలిపై ఉంద‌ని అంటున్నారు. ఇక్క‌డ కూడా కాపు సామాజిక వ‌ర్గం ఓటు బ్యాంకు ఎక్కువ‌. పైగా.. గ‌తంలో అవంతి శ్రీనివాస‌రావు.. గంటా శ్రీనివాస‌రావు వంటి.. కాపు నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకున్నారు. సో.. ఈ నియోజ‌క‌వ‌ర్గం అయితే.. మ‌రింత బెట‌ర్ అని జ‌న‌సేన నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రింత స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో.. రెండింటిని ఎంపిక చేసుకుని.. ప‌వ‌న్ పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని.. జ‌న‌సేన వ‌ర్గాలు భావిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నాయ‌కుడు ఖ‌చ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెడ‌తార‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.