Begin typing your search above and press return to search.

అమరావతికి మద్దతివ్వకూడదని పవన్ నిర్ణయం?

By:  Tupaki Desk   |   11 Jan 2020 10:26 AM GMT
అమరావతికి మద్దతివ్వకూడదని పవన్ నిర్ణయం?
X
ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతిని తరలించవద్దని వారం కిందటే జనసేనాని పవన్ కళ్యాన్ ఎంత యాగీ చేశాడో చూశాం. అమరావతిలోని మందడం వెళ్లడానికి రోడ్డుపై పడుకొని ముళ్లకంచెలు దాటి రైతులను కలుసుకొని నానా రచ్చ చేశాడు. అమరావతి రైతుల కోసం ప్రాణాలిస్తానని భీషణ ప్రతీజ్ఞలు, వాగ్ధానాలు చేశారు. కానీ ఇప్పుడు రాజధాని అమరావతికి జనసేన మద్దతు ఇవ్వకూడదని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగినట్టు వార్తలు బయటకు వచ్చాయి.

తాజాగా శనివారం మంగళగిరిలో భేటి అయిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేన అధ్యక్షుడు, కార్యవర్గం కలిసి అమరావతి ఆందోళనకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది.. ఇప్పటికిప్పుడు రాజధాని అమరావతి అంశంపై ఆందోళన చేయాల్సిన అవసరం లేదని పవన్ సహా నేతలు నిర్ణయించారు. అమరావతిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చాక ప్రత్యక్ష కార్యాచరణ చెబుతామన్నారు. ఇప్పుడు రోడ్డెక్కడం వల్ల లాభం లేదని అమరావతి రాజధాని రైతుల కోసం ఆందోళన చేయడం మానుకోవాలని జనసేన పార్టీ నిర్ణయించింది.

దీంతో ఇక నుంచి అమరావతి రాజధాని ఆందోళనలకు జనసేన దూరంగా ఉండనునున్నట్టు తెలిసింది. పవన్ సైతం అమరావతి రైతుల కోసం పోరాడరని అర్థమవుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

దీనికి కారణం రాబోయే స్థానిక సంస్థలేనని తెలుస్తోంది. రాజధాని కోసం పోరాడితే రాష్ట్రవ్యాప్తంగా జనసేన గెలవదని.. అందుకే అమరావతిని వదిలేయడమే మంచిదని నేతలు సూచించినట్టు తెలిసింది. టీడీపీతో కలిసి అమరావతిలో ఆందోళన చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ దెబ్బతింటుందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవదని.. అందుకే అమరావతి ఆందోళనకు జనసేన దూరం జరిగిందన్న వాదన వినిపిస్తోంది.