Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ టీడీపీకి దారిచ్చేశారా.. ఇక‌, దూసుకుపోవ‌డ‌మేనా..?

By:  Tupaki Desk   |   7 Dec 2022 5:37 AM GMT
ప‌వ‌న్  టీడీపీకి దారిచ్చేశారా.. ఇక‌, దూసుకుపోవ‌డ‌మేనా..?
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు. దీనికి ఒక విధానం అంటూ ప్ర‌త్యేకంగా ఉండ‌దు. దీని విధానాలు కూడా మారుతూనే ఉంటాయి.ఈ విధానాలు ఒక్కొక్క‌సారి చిత్రంగా కూడా ఉంటాయి. ప‌రోక్ష‌, ప్ర‌త్య‌క్ష ప‌ద్ధ తుల్లో మేలు చేసేందుకు ఇవి ఉప‌క‌రిస్తాయి కూడా! ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇలాంటి ప‌ద్ధ‌తి ఎంచుకున్నారా? అనే సందేహాలు మేధావుల‌కు క‌లుగుతున్నాయి.

మ‌రోవైపు టీడీపీలో మాత్రం జ‌న‌సేన వ్య‌వ‌హారం జోష్ నింపుతోంది. దీనికి కార‌ణం.. ప‌వ‌న్ అనుస‌రిస్తున్న తాజా వ్యూహ‌మేనని చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రిస్తా న‌ని.. ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి కూడా వ‌స్తామ‌ని వైసీపీ ఎమ్మెల్యేల‌ను అప్ప‌టికి మాజీలుగా మార్చి.. ఖ‌చ్చితంగా ఓడిస్తాన‌ని కూడా ఆయ‌న కామెంట్లు చేశారు.

అయితే, రాజ‌కీయం క‌దా.. ఇప్పుడు వ్యూహం మారిపోయిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎలాగంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి పోటీ చేయాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు. అయితే, దీనికి బీజేపీ పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు.

క‌నీసం.. ఆ పార్టీ పొడ‌ను కూడా బీజేపీ నేత‌లు స‌హించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను దూరం పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ఎత్తుల‌ను మాత్రం వారు ఆప‌లేరు క‌దా!

ఇదే జ‌రిగింద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అంటే.. ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీతో పొత్తు పెట్టుకోక‌పోయినా.. ఓట్లు చీల్చ‌కుండా ఉండేలాప్ర‌య‌త్నాలు చేస్తారు. తాను ఎక్క‌డా పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌కుండా.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై.. మిగిలి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి అనుకూలంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

మొత్తంగా చూస్తే.. ఇది టీడీపీకి పెద్ద మేలు. అంటే, పైకి వారు పొత్తులో ఉండ‌రు. కానీ, తెర‌వెనుక మాత్రం వ్యూహాత్మక విధానం ఉంటుంది. ఇదీ.. విష‌యం. అందుకే టీడీపీలో కొత్త జోష్ క‌నిపిస్తోంద‌నిఅంటున్నారు.