Begin typing your search above and press return to search.
సైలెంటుగా నొప్పులు భరిస్తున్న పవన్
By: Tupaki Desk | 4 Aug 2021 12:30 PM GMTపాపం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి మరీ ఘోరంగా తయారైంది. ఇటు రాష్ట్రంలోని అధికారపార్టీ ఏ విషయంలోను లెక్క చేయటంలేదు. అటు కేంద్రంలోని మిత్రపక్షమూ పట్టంచుకోవటంలేదు. అందుకనే సాలర్జంగ్ మ్యూజియంలోని గడియారంలో గంటలు కొట్టే పక్షిలాగ ఎప్పుడో ఓసారి కనబడుతున్నారు. పార్టీ మీటింగ్ అనో లేకపోతే ట్విట్టర్లో ప్రెస్ రిలీజో చేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు. జన సమస్యలపై స్పందించేత తీరిక, ఓపికి, సబ్జెక్టు కూడా పవన్ దగ్గర లేదని ఎప్పుడో తేలిపోయింది.
ఇంతకీ విషయం ఏమిటంటే పెట్రోలు, డీజల్, గ్యాస్ ధరలను కేంద్రం భారీగా పెంచేసింది. వంట గ్యాస్ సిలిండర్ పై సుమారు 80 రూపాయలు ఒక్కసారిగా పెరిగిపోయింది. సోమవారం వంట గ్యాస్ సిలిండర్ ధర 880 రూపాయలు. పెట్రోలు, డీజలు ధరలు పెరిగిపోతున్నందుకు మగాళ్ళు, వంటగ్యాస్ ధరలు పెరిగిపోతున్నందకు మహిళలు కేంద్రాన్ని అమ్మనాబూతులు తిట్టుకుంటున్నారు. కళ్ళముందే ప్రతిరోజు ధరలు పెరుగుతున్న విషయం చూస్తూ కూడా ఏమి మాట్లాడలేకపోతున్నారు.
జనాలకు మంటెక్కిపోతున్న ధరలపైన పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేకపోతున్నారంటే కారణం బీజేపీ మిత్రపక్షం అవ్వటమే. పెరుగుతున్న ధరలను సమర్ధించలేరు అలాగని బహిరంగంగా వ్యతిరేకించలేకపోతున్నారు. పవన్ పరిస్ధితి ఎలాగైపోయిందంటే పోలీసులు కొట్టే మూగదెబ్బల్లాగైపోయింది పవన్ విషయంలో. విచిత్రమేమిటంటే పెట్రోలు, డీజల్ ధరల పెరుగుదలకు జగన్మోహన్ రెడ్డే కారణమని టీడీపీ నేతలతో కలిసి ఒకపుడు ఇదే పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది.
పెట్రోల్, డీజల్ ధరల విషయంలో రాష్ట్రం పన్నులు కూడా కలిసే ఉంటాయి. వాటిని రాష్ట్రం తగ్గించుకుంటే వీటి ధలు కొంతైనా తగ్గుతాయి. కానీ అసలు ధరలను తగ్గించాల్సిందైతే కేంద్రమే. ప్రస్తుత కరోనా వైరస్ నేపధ్యంలో పెట్రోల్, డీజల్ ధరలపై పన్నులు రూపంలో వస్తున్న ఆదాయం కూడా కీలకమైపోయింది. ఇతరత్రా ఆదాయాలు బాగా తగ్గిపోయాయి కాబట్టి ఈ పన్నులను రాష్ట్రాలు తగ్గించుకునే అవకాశాలు లేవు. ఏదేమైనా నరేంద్రమోడి పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నా పవన్ మాత్రం నోరిప్పలేకపోతున్నారు..పాపం.