Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ అండ్ ప‌వ‌ర్ : కొత్త వివాదంలో జ‌న‌సేన?

By:  Tupaki Desk   |   12 Feb 2022 5:51 AM GMT
ప‌వ‌న్ అండ్ ప‌వ‌ర్ : కొత్త వివాదంలో జ‌న‌సేన?
X
వివాదాస్ప‌ద రాజ‌ధాని విష‌య‌మై జ‌న‌సేన స్పందించి మ‌రో వివాదానికి తెర‌తీసింది.రాజ‌ధాని రైతుల‌తో ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తులు మాట్లాడేందుకు చొర‌వ చూపాల‌న్న‌ది జ‌న‌సేన సుస్ప‌ష్ట అభిప్రాయం.అదేవిధంగా చ‌ర్చ‌ల‌తోనే మంచి ఫ‌లితాలు అందించిన వైసీపీ అదే రీతిన ఇక్క‌డ కూడా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుకుంటోంది.ఆ వివరం ఆ వివాదం సంబంధిత ఈ క‌థ‌నంలో...

సినీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు అనంత‌రం వైసీపీ బాస్ ఇమేజ్ పెరిగింది.ఆయ‌నతో కాస్త చ‌ర్చిస్తే చాలు కాసిన్ని మంచి ఫ‌లితాలే అందుతాయి అన్న వాద‌న ఇప్పుడిక సుదృఢం అవుతోంది.అదేవిధంగా ప‌వ‌న్ కూడా అదే ప‌నిగా వైసీపీని విమ‌ర్శించేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు.మొన్న‌టి వేళ కూడా ఏ వ్యాఖ్య అయినా త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దు అని స‌జ్జ‌ల‌కు విన్న‌వించారు ప‌వ‌న్.అంటే అమ‌రావ‌తి రైతుల స‌మ‌స్య‌ల‌కు సంబంధించి కూడా ఇవాళ జ‌న‌సేన చెబుతున్న మాట‌ల‌ను కూడా వైసీపీ సానుకూలంగా అర్థం చేసుకోవాలి అన్న‌దే నిన్న‌టి ప‌వ‌న్ విన్న‌పానికి ఉన్న అర్థం.ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ కూడా రైతుల‌తో చ‌ర్చిస్తే కొన్ని విష‌యాల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చేందుకు వీలుంది.రైతులు ఇప్ప‌టిదాకా చెబుతున్న డిమాండ్ల‌ను వింటే చాలు వాళ్లూ ఆనందించ‌డం ఖాయం.

మ‌ధ్యేమార్గంగా కొన్నింటికి ప‌రిష్కారం ఇస్తే ఇంకా మేలు.

కొత్త వివాదంలో జ‌న‌సేన ఇరుక్కుపోయింది.ఎన్న‌డూ లేని విధంగా ఎటుపోవాలో తేల్చుకోలేక‌పోతోంది.ముఖ్యంగా రాజ‌కీయ ప్ర‌గ‌తికి సంకేతాలు అందుతున్న త‌రుణాన మ‌ళ్లీ ఓ అడుగు వెన‌క్కు ప‌డ‌నుంది.జ‌గ‌న్ తో చిరు భేటీ త‌రువాత జ‌నసైనికుల గొంతుక‌ల్లో తేడాలు వ‌చ్చాయి.వ్యాఖ్య‌ల్లో కూడా తేడాలు వ‌చ్చాయి.అంతెత్తు మ‌నిషిని ఆఫీసుకు ర‌ప్పించుకుంటారా అంటూ చాలా మంది అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.ఇదే స‌మ‌యాన త‌మ బాధ‌ను వెల్ల‌డి చేయ‌లేక కొంద‌రు మౌనం వ‌హిస్తున్నారు. మెగాస్టార్ చేతులెత్తి మొక్కిన వైనంపైనే ఇప్పుడు ట్రోల్స్ న‌డుస్తున్నాయి.ఇదే సమ‌యాన సానుకూల అభిప్రాయం కూడా వ్య‌క్తం అవుతోంది.అన్న‌య్య సాటి వ్య‌క్తి మేలు కోసం ఏమ‌యినా చేస్తారు అనేందుకు తార్కాణంలా ఉంది నిన్న‌టి భేటీ..అన్న వ్యాఖ్య కూడా చిరు అభిమానుల నుంచి వివ‌న‌స్తోంది.ఇక రాజకీయంగా గ‌ట్టిగా మాట్లాడితే ఎక్క‌డ సొంతింటి మ‌నిషిని ఇబ్బందుల్లో పెట్టిన‌వారం అవుతామేమోన‌ని వారంతా అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.

ఇదే సంద‌ర్భంలో జ‌న‌సేన నాయ‌కత్వ బాధ్య‌త‌ల్లో భాగం అందుకుంటున్న స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ మీడియా ముందుకు వ‌చ్చి ఓ కొత్త ప్ర‌తిపాద‌నను ఉంచారు.సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌తో మాట్లాడిన విధంగానే అమ‌రావ‌తి రైతుల‌తోనూ మాట్లాడితే మేలు అన్న‌ది ఆయ‌న ప్ర‌తిపాద‌న‌.అవును! గ‌త కొంత‌కాలంగా సంబంధిత త‌గాదా ఒక‌టి న‌డుస్తోంది.ప్ర‌భుత్వం ఇప్పుడు అమ‌రావ‌తి రైతుల‌తో మాట్లాడితే ఓ విధంగా జ‌గ‌న్ ఇమేజ్ ఎన్నిక‌ల ముందు మ‌రింత పెర‌గ‌డం ఖాయం.ప‌రిశ్ర‌మ విష‌య‌మై ఏ విధంగా ఆచి తూచి స్పందించి మంచి ప్ర‌శంస లేదా మెప్పు పొందారో అదే విధంగా అమ‌రావ‌తి రైతుల గురించి కూడా జ‌గ‌న్ స్పందిస్తే ఆయ‌న ఇమేజ్ డ‌బుల్ లేదా ట్రిపుల్ అవ్వ‌డం ఖాయ‌మని అంటున్నారు జ‌న‌సేన పెద్ద.

రాజ‌ధాని స‌మ‌స్య‌ల‌పై రైతుల‌తో చర్చించ‌డం అన్న‌ది ఇప్పుడు ఆవ‌శ్య‌కం ఎందుకంటే త్వ‌ర‌లో దీనిపై ఓ బిల్లు బ‌డ్జెట్ స‌మావేశాల్లో

ప్ర‌వేశ పెట్ట‌నున్నారు క‌నుక‌! ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన చెప్పిన సూచ‌న పాటిస్తే..కొంతమేర రైతుల ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చిన వారు అవుతారు.న‌ల్ల చ‌ట్టాల విష‌య‌మై మోడీ వెన‌క్కు త‌గ్గిన విధంగా జ‌గ‌న్ కూడా వెనక్కు త‌గ్గి ఆలోచిస్తే మేలిమి ఫ‌లితాలు వ‌స్తాయి

అన్న‌ది జ‌గ‌న్ కు జ‌న‌సేన సూచ‌న.పాటిస్తారా లేదా అన్న‌ది వైసీపీ కి ఉన్న నిర్ణ‌యాత్మ‌క ధోర‌ణిలో భాగం అవుతుంది.