Begin typing your search above and press return to search.
ప్రభుత్వమే చిచ్చుపెట్టింది..కోపం వస్తోంది: పవన్
By: Tupaki Desk | 16 Feb 2018 1:55 PM GMTఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలపై జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటైన నిజనిర్ధాణ కమిటీ దసపల్లా హోటల్ లో సమావేశమైంది. లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ - సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ - సీపీఎం ఏపీ కార్యదర్శి మధు - సీపీఐ ఏపీ కార్యాదర్శి రామకృష్ణతో పాటు ఆర్థిక నిపుణులు - మేధావులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన సహేతుకంగా జరగలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల ప్రమేయం లేకుండా రాష్ట్రాన్ని విభజించారని - న్యాయం జరగనప్పుడు ప్రభుత్వంపై కోపం వస్తుందని జనసేన అదినేత పవన్ కల్యాణ్ అన్నారు. పాలకులు చేసిన తప్పులతో సామాన్యులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాంతాన్నైనా దీర్ఘకాలం వెనుకబాటుతనం పీడిస్తే... దేశ సమగ్రతకే ప్రమాదం ఏర్పడుతుందని - దీంతో ప్రజల్లో తిరుగుబాటు తనం వస్తుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే జేఎఫ్ సీలో చేరేందుకు టీడీపీ - వైసీపీ - బీజేపీ సుముఖత చూపలేదని వివరించారు. టీడీపీ - బీజేపీ - వైసీపీకి సొంత ఏజెండా ఉండటంతో మీటింగ్ కు రాలేదన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు - ఇప్పటివరకు జరిగిన కేటాయింపులు - ఖర్చులకు సంబంధించి వాస్తవాలను వెలికి తీసేందుకు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నిధుల కేటాయింపులపై లెక్కలు అడిగితే .. గతంలో చెప్పినట్లే టీడీపీ - బీజేపీ నేతలు వెబ్ సెట్ లో లెక్కలు చూసుకోమన్నారని తెలిపారు. ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పాలని - ప్రజల్లో ఆశలు కల్పించి... కాదంటే అశాంతి రగులుతుందన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఉత్తరాంధ్రలో... రెండు జాతుల మధ్య ప్రభుత్వమే చిచ్చుపెట్టిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏపీలో ఇదివరకెప్పుడూ మేధావులంతా ఒకే వేదికపైకి రాలేదని పవన్ చెప్పారు. జేఎఫ్ సీ సమావేశానికి కాంగ్రెస్ నేతలను ఆహ్వానించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. విభజన హామీలు - ఏపీకి నష్టంపై కాంగ్రెస్ అభిప్రాయాలను తెలుసుకోవడానికే వారి నేతలను ఆహ్వానించామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి వారిని ఆహ్వానించింది వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికే కానీ వారితో అంటకాగడానికి కాదని పవన్ కల్యాణ్ అన్నారు. జేఎఫ్ సీ సమావేశాలు వరుసగా కొనసాగుతాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అంశంపై రాజకీయ నాయకులు ప్రకటనలు చేయాల్సి ఉంటుందని అన్నారు.
విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 9 నెలల ముందు వైసీపీ రాజీనామాలు చేస్తే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఎంపీలు పార్లమెంటులోనే పోరాడాలని అన్నారు. టీడీపీ- బీజేపీ నాయకులు ఎవరి వాదన వాళ్లు చెబుతున్నారన్న ఉండవల్లి.. ఎవరూ కూడా అసలు విషయం చెప్పడం లేదని అన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి గోపాల గౌడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తో తనకు చాలా దగ్గర సంబంధం ఉందని అన్నారు. తన తల్లిది చిత్తూరు జిల్లా అని ఆయన చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగిందని, ఏపీకి రావాల్సిన నిధులు సరిగా రావడంలేదని ఈ నేపథ్యంలో పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని గౌడ అన్నారు. న్యాయమూర్తిగా ఉన్న తాను కమిటీకి కావాల్సిన సలహాలు ఇస్తాన్నారు. ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఏమేమి ఇచ్చింది. ఇంకా ఇవ్వాల్సిందేముందన్నదానిపై ఒక నివేదిక తయారు చేయడానికే ఈ కమిటీ ఏర్పడిందని గౌడ స్పష్టం చేశారు.