Begin typing your search above and press return to search.

జైలు అనుభవనాల్ని ఏకరువు పెట్టిన పాయల్

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:26 PM IST
జైలు అనుభవనాల్ని ఏకరువు పెట్టిన పాయల్
X
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మనసుకు నచ్చిన ఏదైనా చెప్పేసే వీలుంది. కొన్నిసార్లు సంచలనం కోసం..మరికొన్నిసార్లు మనసు నమ్మిన విషయాల్ని చెప్పాలన్న బలమైన కాంక్షతో వచ్చిపడే సమస్యల గురించి ఆలోచించకుండా చేసే వ్యాఖ్యలతో సెలబ్రిటీలు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు నటి పాయల్ రోహత్గీ.

ఇటీవల ఆమె విడుదల చేసిన ఒక చిట్టి వీడియో.. ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. నెహ్రూ కుటుంబాన్ని కించపరిచేలా ఉన్న ఈ వివాదాస్పద వీడియో ఆమెను జైలుకు వెళ్లేలా చేసింది. దేశ మాజీ ప్రధాని నెహ్రుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో ఆమె రాజస్థాన్ లోని జైల్లో ఉంచారు.

రెండు రోజుల జైలు జీవితం తర్వాత ఆమెకు రాజస్థాన్ లోని స్థానిక కోర్టు ఇచ్చిన బెయిల్ తో బయటకు వచ్చారు. ఈ సందర్భంగా తన జైలు జీవితం గురించి ఆమె ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. తనను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పిన ఆమె.. జైల్లో ఉన్నన్ని రోజులు తాను చాలా భయపడినట్లు చెప్పారు.

నిద్ర లేని రాత్రుల్ని గడిపానని.. చలిలో వణికినట్లు చెప్పారు. జైల్లో నేల మీద చాప వేసుకొని నిద్రపోయానని.. జైల్లో గడపటం తనకు ఇదే తొలిసారని.. ఇదే చివరిసారి కూడా అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జైల్లోని వారు చాలా మంచివారని.. వారి కథలు తన మనసును తాకినట్లు చెప్పారు. నెహ్రు ఫ్యామిలీ మీద ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో రానున్న రోజుల్లో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి?