Begin typing your search above and press return to search.

పేటీఎంకే ఆరు లక్ష‌లు టోపీ పెట్టేశారు!

By:  Tupaki Desk   |   16 Dec 2016 1:10 PM GMT
పేటీఎంకే ఆరు లక్ష‌లు టోపీ పెట్టేశారు!
X
డిజిట‌ల్ లావాదేవీల దేశీయ‌ దిగ్గ‌జం పీటీఎంకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఈ-వాలెట్‌ లు సుర‌క్షిత‌మేనా అన్న చ‌ర్చ ఓవైపు దేశ‌మంతా న‌డుస్తుంటే.. అలాంటి ఈ-వాలెట్ సంస్థ‌నే ముంచారు కొంద‌రు క‌స్ట‌మ‌ర్లు. ఈ-వాలెట్ సంస్థ పేటీఎంను కొంత‌ మంది క‌స్ట‌మ‌ర్లు రూ.6.15 లక్ష‌ల మేర మోస‌గించిన‌ట్లు సీబీఐ కేసు న‌మోదు చేసింది. సాధార‌ణంగా ఇలాంటి కేసుల్లో విచార‌ణ జ‌ర‌ప‌డానికి నిరాక‌రించే సీబీఐ.. ఈ కేసును మాత్రం తీసుకోవ‌డం విశేషం.

ఢిల్లీలోని క‌ల్కాజీ - గోవింద్‌ పురి - సాకేత్ ప్రాంతాల్లో ఉండే 15 మంది క‌స్ట‌మ‌ర్ల‌పై సీబీఐ ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసింది. వీళ్లు కాకుండా పేటీఎం మాతృసంస్థ అయిన వ‌న్‌97 క‌మ్యూనికేష‌న్స్‌లోని కొంత‌మంది అధికారుల పేర్లు కూడా ఎఫ్ ఐఆర్‌ లో ఉన్నాయి. సంస్థ‌ లీగ‌ల్ మేనేజ‌ర్ శివ‌కుమార్ ఈ మోసంపై ఫిర్యాదుచేయ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. సాధార‌ణంగా ఏవైనా లోపం ఉన్న వ‌స్తువులు క‌స్ట‌మ‌ర్లు అందుకున్న‌పుడు వాటిని తిరిగి ఉత్ప‌త్తిదారుకు అప్ప‌గించ‌డంతోపాటు క‌స్ట‌మ‌ర్ల‌కు పేటీఎం రీఫండ్ చేస్తుంది. ఈ ప్ర‌క్రియ కోసం క‌స్ట‌మ‌ర్ కేర్ టీమ్ ఉంటుంది. ఇందులోని ఎగ్జిక్యూటివ్స్‌ కి ప్ర‌త్యేకంగా ఐడీ - పాస్‌ వ‌ర్డ్స్ ఉంటాయి. అయితే 48 కేసుల్లో మాత్రం క‌స్ట‌మ‌ర్లు వ‌స్తువుల‌ను అందుకున్నా.. రీఫండ్ కూడా పొందారు అని శివ‌కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం రూ.6.15 ల‌క్ష‌ల‌కు స‌మాన‌మ‌ని ఆయ‌న చెప్పారు. క‌స్ట‌మ‌ర్లు అక్ర‌మంగా డ‌బ్బును రీఫండ్ చేయించుకున్న‌ట్లు ఎఫ్ ఐఆర్‌ లో పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/