Begin typing your search above and press return to search.
హార్వర్డ్ లో పేటీఎం విజయగాథ
By: Tupaki Desk | 30 Jan 2017 5:30 PM GMTపేటీఎం..ఇపుడు ఈ యాప్ గురించి పరిచయం అక్కర్లేదు. అయితే భారతీయులకే పరిమితమైన ఈ యాప్ ఇక నుంచి విశ్వవ్యాప్తం కానుంది. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన హార్వర్డ్‌లో ఇక పేటీఎం సక్సెస్ స్టోరీకి సంబంధించిన పాఠాలు కూడా చెప్పనున్నారు. డిజిటల్ వాలెట్‌గా మొదలై.. పేమెంట్ బ్యాంక్‌గా ఎదిగిన తీరును ఓ కేస్ స్టడీగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్ బీఎస్)లోని ఇండియా రీసెర్చ్ సెంటర్ (ఐఆర్ సీ) ప్రచురించింది. పేటీఎం: బిల్డింగ్ ఎ పేమెంట్స్ నెట్ వర్క్ పేరుతో ఈ స్టడీ పబ్లిష్ అయింది. ప్రస్తుతం దీనిని హార్వర్డ్ లోపల, బయట కూడా టీచింగ్ కు వినియోగించనున్నారు.
2006లో ఐఆర్ సీ ప్రారంభమైన ఐఆర్ సీ దక్షిణాసియా ప్రాంతంలో వస్తున్న మార్పులు, ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు పరిశోధించి హార్వర్డ్ ఫ్యాకల్టీకి కేస్ స్టడీస్ ను అందిస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా చెల్లింపుల్లో పేటీఎం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. ఇది ఇండియా డిజిటల్ భవిష్యత్తుకు నిదర్శనంగా నిలుస్తున్నది అని ఈ కేస్ స్టడీలో ఒకరైన ప్రొఫెసర్ సునీల్ గుప్తా అన్నారు. సునీల్ గుప్తాతోపాటు మరో ప్రొఫెసర్ దాస్ నారాయణ్ దాస్ గతంలో ఫ్లిప్‌కార్ట్ తన లాజిస్టిక్స్ యూనిట్ ఈకార్ట్ ను ఓ ప్రత్యేక కంపెనీగా చేయాలన్న నిర్ణయంపై కూడా ఓ కేస్ స్టడీని ప్రచురించారు. హార్వర్ట్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో తమ సక్సెస్ స్టోరీ పాఠాలుగా బోధించడం తమకు గర్వకారణమని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ అన్నారు. ఇండియాలోని 50 కోట్ల మందిని ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భాగం చేసే బృహత్తర కార్యక్రమం తాము చేపట్టామని ఆయన వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/