Begin typing your search above and press return to search.

తిట్టుకుంటున్న పేటీఎం - ఫేస్ బుక్

By:  Tupaki Desk   |   16 Feb 2018 8:26 AM GMT
తిట్టుకుంటున్న పేటీఎం - ఫేస్ బుక్
X
ప్ర‌పంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద‌సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ అయిన ఫేస్ బుక్ పై మొబైల్ పేమెంట్ వ్యాలెట్ గా గుర్తింపు తెచ్చుకున్న పేటీఎం మండిప‌డింది. నేటి కంప్యూట‌ర్ యుగంలో అతి పెద్ద దుష్ట‌శ‌క్తిగా ఫేస్ బుక్ త‌యారైంద‌ని పేటీఎం వ్య‌వ‌స్థాప‌కుడు విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఫేస్ బుక్ ఆధీనంలో ఉన్న వాట్సాప్ డిజిట‌ల్ పేమెంట్ స‌ర్వీసుల్లోకి అడుగు పెట్టింది. ఈ నేప‌థ్యంలో పేటీఎం కు పోటీగా వాట్సాప్ వ‌స్తుంద‌ని భావించిన విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పేటీఎం కు పోటీగా బ‌రిలోకి దిగిన వాట్సాప్ డిజిట‌ల్ పేమెంట్ కార్య‌క‌లాపాల్ని చాప‌కింద నీరులా వ్యాప్తిచేస్తుంది. దాదాపు 200కోట్ల వినియోగ‌దారుల్ని సొంతం చేసుకున్న వాట్సాప్ భారీ సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టుంది. ఇందులో భాగంగా వాట్సాప్ తో గ్యాస్ ను బుక్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించేలా కేంద్రంతో మంత‌నాలు జ‌రిపింది. తొలుత ఈ ప్ర‌యోగాన్ని ఉత్త‌ర ప్ర‌దేశ్ లో చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఆ ప్ర‌యోగం కొన‌సాగుతుండా భ‌విష్య‌త్తులో దేశ‌వ్యాప్తంగా అందుబాలోకి తెచ్చేందుకు స‌ద‌రు సంస్థ క‌స‌ర‌త్తులు చేస్తోంది

అంతేకాదు ఆన్ లైన్ లో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ చేసుకునేలా వాట్సాప్ సంస్థ ప్ర‌తినిధులు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ ఫేస్ (యూపీఐ) ఆధ్వ‌ర్యంలో ఎస్‌బీఐ - ఐసీఐసీఐ బ్యాంక్‌ - హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంక్‌ - యాక్సిస్‌ బ్యాంక్‌ లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందం ప్ర‌కారం డేటా భద్రతపై బ్యాంకులు సెక్యూరిటీ చెక్ చేశాయి. ఈ స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తే త్వ‌ర‌లో వాట్సాప్ నుంచి ఆన్ లైన్ పేమెంట్ చేసుకునే వెస‌లుబాటు క‌ల‌గ‌నుంది.

కానీ వాట్సాప్ ఆన్ లైన్ పేమెంట్ ను కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌తిరేకించింది. వాట్సాప్ వ‌ల్ల భ‌ద్ర‌తా ప‌ర‌మైన ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వాట్సాప్ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, ఆర్ధిక ప‌ర‌మైన సంస్థ‌గా గుర్తింపులేనందున వాట్సాప్ లో ఆన్ లైన్ ట్రాన్సాక్ష‌న్స్ ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు సూచించింది.

ఓ వైపు వాట్సాప్ పే తో డిజిట‌ల్ పేమెంట్స్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుండగా...ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా డిజిట‌ల్ పేమెంట్స్ అగ్ర‌స్థానంలో ఉన్న పేటీఎం విమ‌ర్శ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓ కార్య‌క్ర‌మంలో నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడిన పేటీఎం అధినేత శర్మ ప్ర‌పంచాన్ని నాశ‌నం చేస్తుంది ఫేస్ బుక్కేన‌ని నిప్పులు చెరిగారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలిచ్చి పేమెంట్ యాప్ తో కార్య‌క‌లాపాల్ని కొన‌సాగిస్తుంద‌ని అన్నారు. డిజిట‌ల్ పేమెంట్ల‌లో థ్రీ అథెంటికేష‌న్ తో సంబంధం లేకుండా చేస్తే భార‌త దేశ భ‌ద్ర‌త‌కు స‌వాలుగా మారుతుంద‌ని సూచించారు. దేశంలో వాట్సాపే నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేస్తే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.