Begin typing your search above and press return to search.
పేటీఎం అధిపతి కొత్తిల్లు రేటు ఎంతంటే?
By: Tupaki Desk | 7 Jun 2017 7:27 AM GMTఇంటర్నెట్ వేదికగా చేసుకొని వ్యాపారం చేయటం.. ఆన్ లావీదేవీలకు వేదికగా నిలవటం ఒక ఎత్తు అయితే.. పెద్దనోట్ల రద్దు అనంతరం.. డిజిటల్ చెల్లింపులకు ఎంతో కీలకంగా మారి.. సామాన్యులు సైతం.. డిజిటల్ చెల్లింపులు జరిపేలా చేసిన ఘనతలో పేటీఎంకు పెద్దపీట వేయాల్సిందే.
పెద్దనోట్ల రద్దు కారణంగా ఎవరెంత ఇబ్బంది పడినా.. భారీగా లాభపడింది ఎవరంటే మాత్రం పేటీఎం అనే చెప్పాలి. నోట్ల రద్దు నేపథ్యంలో పేటీఎంకు పెరిగిన ప్రాధాన్యత పుణ్యమా అని కంపెనీ దూసుకెళ్లటమే కాదు.. దాని వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సంపదను భారీగా పెరిగేలా చేసిందని చెప్పక తప్పదు.
నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో దూసుకెళ్లిన పేటీఎం పుణ్యమా అని.. శర్మ ఫోర్బ్స్ జాబితాలో అతి పిన్న వయసులోనే భారత బిలియనీర్ జాబితాలో చోటు దక్కించుకోవటమే కాదు.. ఆయన నికర సంపద భారీగా పెరిగింది. గత ఏడాది శర్మ సంపద ఏకంగా 162 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా శర్మకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ లో ఒకటైన న్యూఢిల్లీ గల్ఫ్ లింక్స్ లో ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది. ఈ డీల్ విలువ సుమారు రూ.82 కోట్లు పైనే ఉంటుందని చెబుతున్నారు. లుటియెన్స్ జోన్ లో 6వేల చదరపు అడుగుల ప్రాపర్టీని ఆయన కొనుగోలు చేస్తున్నారని.. ఇందుకు సంబంధించిన ఎంవోయి పూర్తి చేశారని చెబుతున్నారు. ఈ డీల్ కి సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ లావీదేవీ రిజిష్టర్ కాలేదని చెబుతున్నారు. మార్కెట్లో పేరు ప్రఖ్యాతలతో పాటు.. బిజినెస్ మాంచి ఊపులో ఉన్న వేళ.. శర్మ కొంటున్న ఖరీదైన ఇంటి వ్యవహారం ఇప్పుడాయన పేరును మార్కెట్లో మరోసారి మారుమోగేలా చేస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/