Begin typing your search above and press return to search.
రిక్షా లో సీఎం ఇంటికి పేటీఎం సీఈఓ!!
By: Tupaki Desk | 29 Oct 2016 7:28 AM GMTకొంతమంది సింపుల్ సిటీ వల్ల మరికొంత మందికి మేలు జరుగుతుంది! అదెలా అనుకుంటున్నారా? యూపీలో తాజాగా జరిగిన సంఘటన దీనిని నిరూపించింది. ప్రపంచ దిగ్గజం పేటీఎం సంస్థ సీఈవో తన హోదాను - హుందాతనాన్ని పక్కన పెట్టి కామన్ పౌరుడిగా వ్యవహరించారు. ఇది ఓ రిక్షావాలకు నిజంగానే దీపావళిని తెచ్చిపెట్టింది. విషయంలోకి వెళ్లిపోతే.. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏదో పనిమీద పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ.. యూపీ సీఎం అఖిలేష్ ను కలిసేందుకు బయల్దేరారు. అయితే, లక్నోలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆయన ఆ ట్రిఫిక్ లో ఇరుక్కుపోయారు.
గంటసేపైనా ట్రాఫిక్ క్లియర్ కాలేదట. దీంతో విజయ్.. ఇక లాభం లేదనకుని కారు దిగి.. దగ్గరలోనే ఉన్న ఓ సైకిల్ రిక్షా ని పిలిచి దానిని ఎక్కారట. రిక్షామీదే ఏకంగా సీఎం నివాసం 5 కాళిదాస్ మార్గ్ కు వెళ్లారు. అతి పెద్ద సంస్థకు సీఈవో అయిన విజయ్ ఇలా రిక్షాలో రావడం చూసిన అఖిలేష్ ముందు ఆశ్చర్యానికి, ఆ తర్వాత ఆనందానికి లోనయ్యారట! అంత పెద్ద పదవిలో ఉండి కూడా ఎంత సింపుల్ సిటీ ఎంత సింపుల్ సిటీ అని బుగ్గలు నొక్కుకున్నారట. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించి తాను- సీఈవోతోపాటు రిక్షా కార్మికుడు ఉన్న ఫొటోను అఖిలేష్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
‘నగరంలోని ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల పేటీఎమ్ సీఈవో విజయ్ రిక్షా సైకిల్‌లో రావాల్సి వచ్చింది. మెట్రో రాకతోనే లక్నోలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. అంతేకాదు, మరోపక్క - పీటీఎం సీఈవోను తన రిక్షాలో కూర్చోబెట్టుకొని సీఎం నివాసానికి తీసుకొచ్చిన రిక్షావాలా మణిరామ్ కు ఒక్కసారిగా అదృష్టం కలిసొచ్చింది. ఇందుకుగాను అతనికి రూ. 6వేల రివార్డుతోపాటు కొత్త రిక్షా సైకిల్ - కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని సీఎం అఖిలేశ్ హామీ ఇచ్చారు. మరి ఆ రిక్షావాలాకు నిజంగానే దీపావళి వచ్చింది కదూ!! కొంతమంది సింపుల్ సిటీ వల్ల మరికొంత మందికి మేలు జరుగుతుందంటే ఇదే మరి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/