Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : పేటీఎం ఉద్యోగికి కరోనా కంఫార్మ్!
By: Tupaki Desk | 5 March 2020 8:45 AM GMTనిన్న, మొన్నటి వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ కరోనా వైరస్ ..ప్రస్తుతం భారత్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య కొంచెం కొంచెంగా పెరిగిపోతుంది. బుధవారం రోజు వరకు ఇండియా లో కరోనా బాధితుల సంఖ్య 28 గా ఉండగా.. ఈ రోజు మరో పేటీఎం ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీనితో భారత్ లో కరోనా భాదితుల సంఖ్య 29 కి చేరింది.
గురుగాన్ లోని పేటీఎం సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. తమ సంస్థ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా సోకిన ఉద్యోగి ఇటీవలే ఆఫీస్ పని నిమిత్తం ఇటలీ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారని తెలుస్తుంది. ఆ ఉద్యోగికి వైరస్ సోకినందుకు గుర్‌గాన్ లోని పేటీఎం కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అలాగే ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆ సంస్థ సూచించింది.
అలాగే గురుగాన్ లో ఉన్న ఆఫీస్ ని మొత్తం క్లీన్ చేసేవరకు ..ఉద్యోగులందరూ కూడా ఇంటి నుండే పనిచేయాలని తెలిపింది. అయితే, తమ రోజువారి కార్యాకలాపాలపై ఈ ప్రభావం ఏమాత్రం ఉండదు అని .. పేటీఎమ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే సందర్భంలో కరోనా వైరస్ సోకిన ఉద్యోగి ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది అని , ప్రస్తుతం ఐసోలేషన్ లో చికిత్స అందుతుంది అని , ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం అని పేటీఎం ప్రతినిధి ఒకరు తెలిపారు.