Begin typing your search above and press return to search.

దేశంలోనే అతి పెద్ద ఐపీఓ.. మదుపరుల నుంచి భారీ స్పందన!

By:  Tupaki Desk   |   8 Nov 2021 12:25 PM GMT
దేశంలోనే అతి పెద్ద ఐపీఓ.. మదుపరుల నుంచి భారీ స్పందన!
X
ఇటీవల కాలంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన సంస్థలు అన్నీ మార్కెట్ లో భారీ లాభాలను నమోదు చేశాయి. ఓ వైపు కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతున్న సమయంలో కూడా స్టాక్ మార్కెట్ భారీ స్థాయిలో పుంజుకుంది. ఇందుకు గల ప్రధాన కారణాల్లో ఒకటి ఐపీఓకు వచ్చే భారీ స్పందన. దీంతోనే ఇప్పటివరకు వచ్చిన అన్నీ ప్రధాన కంపెనీలు భారీ లాభాలను అందించాయి. ఈక్రమంలోనే ఐపీఓలకు మంచి ఆదరణ లభించింది. అన్నింటి కన్నా ముఖ్యంగా ఇటీవల వచ్చిన జూమాటో, కార్ ట్రేడ్, దేవయాని, రోలెక్స్, గ్లెన్మార్క్ , దొడ్ల డైరీ, కిమ్స్ లాంటి చాలా సంస్థలు అనుకున్న దానికన్నా ఎక్కువ వృద్ధినే నమోదు చేశాయి. ఈ నేపథ్యంలోనే మరికొన్ని సంస్థలు భారీ నిధుల సేకరణే లక్ష్యంగా చేసుకుని ఐపీఓలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని కొనుగోలుకు మదుపరులు కూడా అదే స్థాయిలో వెచి చూస్తున్నారు. ఐపీఓలో వచ్చే ఒక లాట్.. ట్రేడింగ్ కు వచ్చే సరికి దాని విలువ అంతకంతకు పెరగడంతో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా పేటీఎం కూడా ఐపీఓ జాబితాలో వచ్చి చేరింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పేటిఎం ఐపీఓ.. రానే వచ్చింది. మార్కెట్ నుంచి భారీ స్థాయిలో నిధుల సమీకరించాలనే లక్ష్యంతో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కు వచ్చింది. మాతృసంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ పేరుతో సుమారు రూ.18 వేల కోట్లకు పైగా నిధులను సేకరించాలని చూస్తోంది. ఈ ఐపీఓ నవంబర్ 8 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ పదో తేదీతో ముగియనుంది. అయితే ఈ ఐపీఓలో కంపెనీ సుమారు రూ. 8,300 కోట్లను సేకరించడానికి కొత్తగా షేర్లు విక్రయిస్తోంది. ఈ మొత్తం సొమ్ము కేవలం సంస్థకు మాత్రమే చెందుతుంది. దీనితో పాటు పది వేల కోట్ల రూపాయిలకు పైగా షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో సంస్థ విక్రయిస్తుంది. ఇదిలా ఉంటే పేటిఎం ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ ల నుంచి సుమారు ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయిలను వసూలు చేసింది.

ఈ రోజు నుంచే ప్రారంభమైన పేటీఎం ఐపీఓకు మందుపరుల నుంచి భారీ స్పందన వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 2080 కాగా.. గరిష్ఠ ధర మాత్రం రూ. 2150 గా ఉంది. ఈ విధంగా పరిగణాలోకి తీసుకుంటే ఓ లాట్ కు గరిష్ఠ 6 షేర్లు వస్తాయి. దీంతో ఆ లాట్ మొత్తం ధర రూ.12,900 వరకు ఉంది. ఒక్కొ మదుపరుడు పేటీఎంకు గరిష్ఠంగా 15 లాట్లకు మించి దరఖాస్తు చేసుకోకూడదని నిబంధన ఉంది. ఈ స్తాయిలో అప్లై చేయాలి అంటే మొత్తం రూ. 1,93,500 వరకు అకౌంట్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. మరి కొద్ది రోజుల్లోనే పేటీఎంతో పాటు మరి కొన్ని ఐపీఓలు రానున్నాయి. వాటిలో పాలసీ బజార్, సఫైర్స్ ఫుడ్స్ ఇండియా ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్లు ఈ నెల చివరికల్లా ఐపీఓకు రానున్నాయి.