Begin typing your search above and press return to search.
పేటీఎం ఓనరు పబ్లిక్‌గా పరువు తీసుకున్నాడు
By: Tupaki Desk | 4 Dec 2017 1:30 PM GMTపేటీఎం...స్మార్ట్ ఫోన్ వాడే వారికి ఎవరికీ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే...పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ యాప్ చాలా పాపులర్ అయిపోయింది. పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. ప్రచారం చేసుకోవడంలో పాపులర్. పేటీంఎ కరో పేరుతో ప్రచారం చేసుకోవడం కోసం ఆయన చేసిన ట్వీట్ సెల్ఫ్ గోల్ అవడమే కాదు..ఆయన్ను స్థాయిని ఘోరంగా దిగజార్చింది కూడా!
ఇంతకీ ఏం జరిగిందంటే... `భారత సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ కోసం ఇప్పుడే రూ. 501 నేను విరాళంగా ఇచ్చాను.` అంటూ ఆన్ లైన్ పేమెంట్ స్క్రీన్ షాట్ తో సహా శేఖర్ శర్మ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ కాస్త నెగటివ్‌గా వైరల్ అయింది. శేఖర్ శర్మ స్టేచర్ ఏంటి...ఆయన చేసిన పని ఏంటి అంటూ విరుచుకుపడుతున్నారు. ``ఢిల్లీలో 100 కోట్ల ఖరీదైన భవనంలో నివాసముంటున్న ఒక పేటీఎం పెద్దమనిషి.. భారత సాయుధ జవాన్ల సంక్షేమం కోసం రూ. 501 విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నారు`` అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కోట్లాదిపతిగా ఉన్న శర్మ...తన సంస్థకు ప్రచారం కల్పించుకునేందుకు కూడా రూ.501 ఖర్చు చేశారంటే శర్మను అభినందించాల్సిందే అంటూ సెటైర్లు వేస్తున్నారు.