Begin typing your search above and press return to search.

జగన్ జ్వరం ముచ్చట ఎలా తెలుసు పయ్యావుల?

By:  Tupaki Desk   |   19 Nov 2016 7:15 AM GMT
జగన్ జ్వరం ముచ్చట ఎలా తెలుసు పయ్యావుల?
X
పవర్ లో లేనప్పుడు కంటే పవన్ లో ఉంటేనే నేతలు తమ వాయిస్ ను వినిపిస్తుంటారు. అదేం చిత్రమో కానీ.. పదేళ్లు చంద్రబాబు పవర్ లో లేనప్పుడు యమా యాక్టివ్ గా ఉన్న తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్.. పవర్ లోకి వచ్చినప్పుడు మాత్రం ఆయన తన వాయిస్ ను కాస్త టోన్ డౌన్ చేసినట్లుగా చెబుతారు. పయ్యావులకు.. టీడీపీకి మధ్యనున్న ఒక సెంటిమెంట్ ను పలువురు ప్రస్తావిస్తారు. ఆసక్తికరంగా అనిపించే ఈ వ్యవహారం లాజిక్ గా చూస్తే నిజమనిపించక మానదు. అదేమంటే.. పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిస్తే.. టీడీపీ అధికారంలోకి రారని చెబుతారు. దీనికి తగ్గట్లే పయ్యావుల కేశవ్ గెలిచినప్పుడు బాబు ప్రతిపక్షానికి పరిమితం కావటం చూశాం.

అందుకే 2014 సార్వత్రిక ఎన్నికల్లో పయ్యావులను ఓడిపోవాలని సొంత పార్టీ నేతలు పెద్ద ఎత్తున కోరుకున్నారని చెబుతారు.ఆయన ఒక్కడు ఓడిపోయినా ఫర్లేదు.. పార్టీ మాత్రం గెలిచి పవర్ లోకి వస్తుంది కదా వాదనను వినిపిస్తారు. అదేం చిత్రమో కానీ.. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పయ్యావులు ఓడిపోతే.. బాబు మాత్రం పవర్ లోకి వచ్చేశారు. దీంతో.. పయ్యావుల సెంటిమెంట్ వర్క్ వుట్ అయినందుకు తెలుగు తమ్ముళ్లు తెగ సంతోషపడిపోయారు. తన మీద పెట్టుకున్న ఈ సెంటిమెంట్ కు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక పయ్యావుల ఉడికిపోతారని చెబుతారు. వాస్తవానికి పయ్యవుల ఎమ్మెల్యేగా గెలిస్తే బాబు మంత్రివర్గంలో ఆయన బెర్త్ కన్ఫర్మ్ అయ్యేది. కానీ.. ఆయనకు ఆ అవకాశం దక్కని ముచ్చట తెలిసిందే.

తాను ఓడినా పార్టీని గెలిపించిన సెంటిమెంటో.. పయ్యావుల మీద బాబుకున్న పాజిటివ్ కోణమో కానీ ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి కాస్త యాక్టివ్ గా మారిన పయ్యావుల అప్పుడప్పుడు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయటం కనిపిస్తుంది. తాజాగా ఆయన విపక్ష నేత మీద ఆసక్తికరవ్యాఖ్య చేశారు. గతంలో జగన్ కు ఈడీ భయం ఉండేదని.. తాజాగా మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ప్రకటనతో ఆయనకు జ్వరం వచ్చినట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఆయన మోడీ భయం పట్టుకుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం గమనార్హం. జగన్ కు సంబంధించి ఇన్ని మాటలు చెబుతున్న పయ్యావుల జగన్ కు జ్వరం వచ్చినట్లుగా ఎలా చెప్పగలుగుతారు? అన్నది ప్రశ్న. అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండేందుకు తన మాటలకు కాస్తంత మసాలా పూసి చెప్పిన పయ్యావులకు జగన్ జ్వరం ముచ్చట చెప్పినట్లుగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/