Begin typing your search above and press return to search.
ఎంపీ కవితతో రేవంత్ కు వ్యాపార సంబంధాలు: పయ్యావుల
By: Tupaki Desk | 23 Oct 2017 6:56 AM GMTతెలుగుదేశం పార్టీలో మరో కలకలం చోటుచేసుకుంది. ఇప్పటికే ఏపీకి చెందిన మంత్రులు యనమల రామకృష్ణుడు - పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ - ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్..తెలంగాణ సీఎం కేసీఆర్ తో సఖ్యత నెరిపి వ్యాపారాలు చేసుకుంటున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేకెత్తిస్తుండగా...మరోమారు అదే తరహా సంచలనం రేపే కామెంట్లు తెరమీదకు వచ్చాయి. ఈ దఫా బాంబ్ పేల్చింది టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. తెలంగాణ సీఎం కేసీఆర్ అనంతపురం పర్యటనలో తనతో ముచ్చటించడం పట్ల రేవంత్ కామెంట్లు చేసిన నేపథ్యంలో..కేశవ్ సైతం అదే రీతిలో రియాక్టయ్యారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన పయ్యావుల సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ జైలుకు వెళ్లినప్పుడు బాసటగా నిలిచానని...బెయిల్ వచ్చేంత వరకూ అండగా ఉన్నానని కేశవ్ తెలిపారు. అంతటి దోస్తీ ఉన్న వ్యక్తి... కేసీఆర్ తో తనకు లింక్ పెట్టడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్ వెంట ఉన్న మిత్రులు అప్పుడు కనిపించలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ వ్యాఖ్యల ద్వారా తనకు జరిగిన నష్టం కన్న రేవంత్ కే నష్టం ఎక్కువ అని పయ్యావుల కేశవ్ విశ్లేషించారు. రాజకీయాల కోసం మిత్రులను పణంగా పెడతారానే భయం అందరిలో కలిగిందని అన్నారు. పెళ్లిలో కలిసిన దాన్ని అడ్డం పెట్టుకొని...ఆరునెలల డిల్లీ పర్యటనలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ వాడుకున్నారని రేవంత్ తీరును కేశవ్ తీవ్రంగా ఎండగట్టారు.
ఏపీ మంత్రి పరిటాల సునీతతో తనకు వ్యాపార సంబంధాలు లేవని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. తన, పరిటాల సునీత రాజకీయ పంథా ఏమిటి అందరి తెలుసునని కేశవ్ పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ తో వ్యాపార సంబంధాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి రూ.500 కోట్ల కంపెనీకి - రెండు కోట్ల బార్ కు తేడా తెలుసనని పేర్కొంటూ...అయినప్పటికీ ఉద్దేశ పూర్వకంగానే ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తన మేనల్లుడు నలుగురితో కలిసి మైక్రో బ్రూవరీ పెట్టారని - ఆ వ్యాపారంతో తనకు సంబంధం లేదని కేశవ్ వివరణ ఇచ్చారు. మంత్రి పరిటాల సునీత బంధువని చెప్పడం మంచిది కాదని కేశవ్ - రేవంత్ తన వ్యాపార సంబంధాలు చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ - ఎంపీ కవితతో కలిసి కంపెనీ రిజిస్టర్ చేసింది వాస్తవం కాదా అని కేశవ్ ప్రశ్నించారు. `ఈ కంపెనీ విషయంలో మిత్రులు ఒత్తిడి చేస్తే అయిష్టంగా వదులుకోలేదా? జగన్ పార్టీతో తెలంగాణలో అంటకాగడం వాస్తవం కాదా? జగన్ మీడియా రేవంత్ కు సహకరించడం వాస్తవం కాదా? సింగరేణిలో వైసీపీ కండువాలు కప్పకోలేదా? మొన్న బీజేపీ....నిన్న టీఆర్ ఎస్ ఇప్పుడు టీడీపీ ..మరో పార్టీతో సంబందాలు...ఇది రేవంత్ విధానం..నా లక్ష్యం టీడీపీ..జీవితం టీడీపీ`` అని కేశవ్ స్పష్టం చేశారు.