Begin typing your search above and press return to search.
‘పిలిస్తే వెళ్లి మాట్లాడడం నా తప్పా’
By: Tupaki Desk | 11 Oct 2017 8:27 AM GMTపార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నప్పటికీ తనకు సంబంధం లేని చిన్న వ్యవహారంలో తనను తప్పు పడుతున్నట్లుగా పార్టీ అధినేత మాట్లాడడంతో పయ్యావుల కేశవ్ విపరీతమైన అంతర్మధనానికి గురవుతున్నారుట. కేశవ్ ఇలాంటి పనులు చేయడం వల్ల అక్కడ తెలంగాణలో పార్టీ పరువు పోతున్నదని, అక్కడి పార్టీ కార్యకర్తలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కేశవ్ ను ఆవేదనకు గురిచేస్తున్నాయట. పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన కేశవ్.. ‘ఇందులో నా తప్పేముంది.. ఏ తప్పూ లేకుండానే నిందలు భరించాల్సి వస్తోంది’ అంటూ ఆవేదనను తన సన్నిహితుల వద్ద పంచుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల పరిటాల రవి కొడుకు వివాహం అనంతపురం జిల్లాలో జరిగినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. కేసీఆర్ కు ఒక రకంగా అక్కడి తెలుగుదేశం నాయకులు బ్రహ్మరథం పట్టారు. ఆయన పయ్యావుల కేశవ్ ను తన వద్దకు పిలిపించుకుని ఏకాంతంగా కొద్దిసేపు మాట్లాడారు. అయితే మీడియాలో ఇది హైలైట్ అయింది. దీనికి అనుబంధంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి.
పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి వద్ద కేసీఆర్ ను చాలామంది కలిసినప్పటికీ... పయ్యావుల కేశవ్ లాంటి సీనియర్లు కూడా ఇలా చేస్తే ఎలా.. దీని వల్ల పార్టీ పరువు పోతోంది.. ఇలాంటి అత్యుత్సాహం తగదు.. తెలంగాణ నాయకులు రాజీనామాలు చేస్తాం అంటున్నారు.. అంటూ ఆయన ఒక్కడినే కార్నర్ చేస్తున్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘కేసీఆర్ స్వయంగా పిలిపిస్తే తాను దగ్గరకు వెళ్లి మాట్లాడడం కూడా తప్పేనా.. నేనేమైనా ఆయనతో మాట్లాడడానికి నా అంతగా ఎగబడి వెళ్లానా లేదు కదా.. కానీ నిందలు మాత్రం నా ఒక్కడి మీదనే వస్తున్నాయి...’’ అంటూ పయ్యావుల కేశవ్ సన్నిహితుల వద్ద మధన పడుతున్నారట.
కేవలం మీడియాలో హైప్ చేయడం వల్లనే కేసీఆర్- కేశవ్ మాట్లాడుకున్న దానికి అతి ప్రచారం వచ్చిందని, ఆ విషయాన్ని చంద్రబాబు అర్థం చేసుకుని.. అక్కడితో దాని గురించి పట్టించుకోకుండా.. వదిలేసి ఉండాల్సిందని పార్టీ సీనియర్లు అనుకుంటున్నారు. చిన్న విషయాన్ని ఆయన స్వయంగా రాద్ధాంతం చేసేశారని కూడా కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.